Kalyani: కళ్యాణి అక్క విడాకులు తీసుకోవడానికి కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన తమ్ముడు..
ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ కళ్యాణి. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తక్కువ సమయంలోనే విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. అయితే కళ్యాణి వ్యక్తిగత జీవితం అంత సాఫీగా సాగలేదు. ఆమె విడాకుల గురించి అసలు విషయం బయటపెట్టారు ఆమె తమ్ముడు.

టాలీవుడ్ హీరోయిన్ కళ్యాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే చాలా కాలంగా ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల కళ్యాణి సోదరుడు చేతన్ చీను ఒక ఇంటర్వ్యూలో తన సోదరి కళ్యాణి, నటుడు సూర్యకిరణ్ విడాకుల గురించి మాట్లాడారు. కళ్యాణి మాజీ భర్త సూర్య కిరణ్ కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయారు. అంతకు ముందు బిగ్ బాస్ తెలుగు షోలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ కళ్యాణి తిరిగి వస్తే కలిసి ఉండటానికి ఇష్టపడతానని, కళ్యాణి అంటే ఇష్టమని ఎమోషనల్ అయ్యారు. అయితే, వారి విడాకులకు దారితీసిన అసలు కారణాలు ఇప్పటికీ ప్రేక్షకులకు, తమ కుటుంబానికి కూడా తెలియదని చేతన్ పేర్కొన్నారు. ఇది తమ కుటుంబానికి బాధాకరమైన విషయమని, వ్యక్తిగత కారణాలపై తాను మాట్లాడలేనని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : రమ్యకృష్ణ కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. మొదటిసారి తనయుడి గురించి చెప్పిన కృష్ణ వంశీ..
సూర్యకిరణ్‌తో తాను నిరంతరం టచ్‌లో ఉండేవాళ్లమని, తన అక్క కళ్యాణికి సూర్యకిరణ్ అంటే, సూర్యకిరణ్‌కు కళ్యాణి అంటే పరస్పర గౌరవం ఉందని, బహుశా చిన్న క్లాషెస్ కారణమై ఉండవచ్చని చేతన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కళ్యాణి ఇంకా విడాకుల గురించి బహిరంగంగా మాట్లాడలేదని, ఆర్థిక సమస్యలు లేదా ప్రాజెక్టుల నష్టాలు ఒక కారణమై ఉండవచ్చని తాను భావిస్తున్నానని చేతన్ పేర్కొన్నారు. కళ్యాణి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఒకప్పుడు కథానాయికగా, నిర్మాతగా రాణించారు. అలాగే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం సైలెంట్ గా ఉంటున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Folk Song: ఏం పాట భయ్యా.. కుర్రాళ్లకు పిచ్చేక్కించేసింది.. యూట్యూబ్‌ను ఊపేసిన ఫోక్ సాంగ్..
కళ్యాణి విషయానికి వస్తే.. బాలనటిగా తెరంగేట్రం చేసిన ఆమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా తెలుగులో అత్యధిక సినిమాలు చేసుకుంది. ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, లేత మనసులు, పెళ్లాంతో పనేంటి వంటి అనేక సినిమాల్లో నటించింది. చాప్టర్ 6 అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరించింది. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే దర్శకుడు సూర్య కిరణ్ ను వివాహం చేసుకుంది. కానీ కొన్నాళ్లకే వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు కళ్యాణి ఎక్కడ ఉంది.. ? ఏం చేస్తుంది అనేది? ఎవరికీ తెలియదు.
ఎక్కువ మంది చదివినవి : Actress : ఏంట్రా బాబూ.. ఈ సీరియల్ బ్యూటీ ఇంతందంగా మారిపోయింది.. 100 పైగా సినిమాల్లో నటించింది..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : Actress : రాజమౌళి మాటలతో నా గుండె పగిలిపోయింది.. ఆ సినిమా వదులుకోకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ హీరోయిన్..
