సినిమాలకంటే సోషల్ మీడియాతో నే ఫుల్ బిజీగా గడిపేస్తున్న భామ 

31 December 2025

Pic credit - Instagram

Rajeev 

షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన హీరోలు, హీరోయిన్స్ తమ టాలెంట్ తో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. వారిలో ప్రియాంక జవాల్కర్ ఒకరు. 

ఈ ముద్దుగుమ్మ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన టాక్సీవాల సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు  తెచ్చుకుంది. 

తొలి సినిమానే స్టార్ హీరో విజయ్ దేవరకొండ సరసన నటించే ఛాన్స్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. 

ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది.  గమనం,ఎస్ఆర్ కల్యాణమండపం, తిమ్మ‌రుసు సినిమాల్లో నటించింది. 

వీటిలో టాక్సీవాల, ఎస్ఆర్ కల్యాణమండపం సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. 

ఆతర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. కొన్ని సినిమాల్లో స్పెషల్ రోల్స్ లో కనిపించి మెప్పించింది ఈ భామ. 

అలాగే సోషల్ మీడియాలో ప్రియాంక షేర్ చేసే ఫోటోలు కుర్రాళ్లను తెగ కవ్విస్తున్నాయి. అందాలతో ఫిదా చేస్తుంది ఈ అమ్మడు.