- Telugu News Photo Gallery Cinema photos Nani hit3 latest movie update and booking update on 22 04 2025
Nani: బరువంతా నేచురల్ స్టార్ మీదే… హిట్ కొట్టాల్సిందే
లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవు. ఆఖరి క్షణం దాకా చెక్కడాలు లేవు. అంతా చల్ల చల్లగా కూల్ కూల్‌గా అయిపోయింది. అందుకే నాని ప్లానింగ్ గ్రేట్ అంటోంది ఇండస్ట్రీ.. అనుకున్న సమయానికి సినిమా చేసి, ప్రమోషన్లకు పక్కా స్కెచ్ వేసుకుని రంగంలోకి దిగారని మెచ్చుకుంటోంది. ఆల్రెడీ హిట్ ఫస్ట్, సెకండ్ చాప్టర్లతోనే అమాంతం క్రేజ్‌ని మూటగట్టుకుంది హిట్ 3.
Updated on: Apr 22, 2025 | 10:01 PM

ఆల్రెడీ హిట్ ఫస్ట్, సెకండ్ చాప్టర్లతోనే అమాంతం క్రేజ్‌ని మూటగట్టుకుంది హిట్ 3. దానికి తగ్గట్టు టీజర్, ట్రైలర్‌కి యమా రెస్పాన్స్ వస్తోంది. ఆల్రెడీ 2025 బాగానే కలిసొచ్చింది నేచురల్ స్టార్‌కి.

కోర్టు సినిమా నిర్మాతగా చెప్పి మరీ హిట్ కొట్టారు నాని. ఇప్పుడు అదే పాజిటివిటీ హిట్ 3 విషయంలోనూ కంటిన్యూ అవుతుందని పక్కా హోప్‌తో ఉన్నారు నేచురల్ స్టార్ ఫ్యాన్స్.

హిట్ 3 కి యుఎస్‌లో బుకింగ్స్ యమా స్పీడుగా జరుగుతున్నాయి. అక్కడ ప్రీమియర్స్ ప్రీ సేల్స్ ఆల్రెడీ 75కే డాలర్లను దాటి కంటిన్యూ అవుతున్నాయి. నాని కెరీర్‌లో ఫాస్టెస్ట్ ఒన్ మిలియన్ ప్రీ సేల్స్ చూసిన మూవీగా హిట్ 3 నిలుస్తుందని ట్రేడ్ పండిట్స్ అంచనా.

ఇటు గ్రౌండ్‌లోకి ఆల్రెడీ దిగేశారు నేచురల్ స్టార్. నార్త్ వీధుల్లో హల్‌చల్ చేయడానికి అంతా రెడీ. కొన్నాళ్ల పాటు అక్కడే ఉండి, మూవీని జనాల్లోకి తీసుకెళ్లాలని ఫిక్సయిపోయారు హీరో.

సో, రిలీజ్ కౌంట్‌డౌన్ కంప్లీట్ అయ్యేలోపు థియేటర్లలో ఫుట్ ఫాల్స్ ఫుల్‌గా ఉంచే బాధ్యత నాదీ అంటూ రంగంలో దూసుకుపోతున్నారు నాని. థర్డ్ చాప్టర్‌ని హిట్ చేసి చూపించాల్సిన బరువును భుజాలకెత్తుకున్నారు మా హీరో అంటూ తెగ ఖుషీగా ఉన్నారు అభిమానులు.




