- Telugu News Photo Gallery Cinema photos All the movies she has done have been super hits, But No Craz In Tollywood, She Is Catherine Tresa
Tollywood: చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్టు.. అయినా రానీ క్రేజ్.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరోయిన్..
తెలుగులో ఆమె చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్టు. అయినప్పటికీ క్రేజ్ రాలేదు. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ వయ్యారికిన నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోయాయి. స్టార్ హీరోలతో ఎన్నో చిత్రాల్లో నటించింది. అయినా ఈ ముద్దుగుమ్మకు సరైన బ్రేక్ రాలేదు. తాజాగా ఈ బ్యూటీ లేటేస్ట్ ఫోటోస్ వైరలవుతున్నాయి.
Updated on: Apr 22, 2025 | 10:02 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె నటించిన చిత్రాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అతి తక్కువ సమయంలోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. అల్లు అర్జున్, గోపిచంద్, రానా, సిద్ధార్థ్, విజయ్ దేవరకొండ, కళ్యాణ్ రామ్ వంటి స్టార్ హీరోలతో నటించిన క్రేజ్ రాలేదు.

తెలుగులో ఈ వయ్యారికి అంతగా బ్రేక్ రాలేదు. దీంతో నెమ్మదిగా సినిమాలకు దూరమయ్యింది. ఆమె మరెవరో కాదు క్యాథరిన్ ట్రెసా. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని హీరోయిన్. ఇద్దరమ్మాయిలు సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది.

సరైనోడు, బింబిసార వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అంతకు ముందు వరుణ్ సందేశ్ నటించిన చమ్మక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఫస్ట్ మూవీతోనే అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది.

అయితే సినిమాలు హిట్టైనప్పటికీ ఈ బ్యూటీకి అవకాశాలు రాలేదు. చివరగా 2022లో విడుదలైన మాచర్ల నియోజకవర్గం చిత్రంలో నటించింది. ఆ తర్వాత మరో సినిమాలో కనిపించలేదు. కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటుంది.

కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంది. ఎక్కువగా గ్లామర్ ఫోటోషూట్లతో నెట్టింట అరాచకం సృష్టిస్తుంది. తాజాగా ఈ అమ్మడి ఫోటోస్ నెట్టింట ఆకట్టుకుంటున్నాయి.




