- Telugu News Photo Gallery Cinema photos Trisha in trending from past three days know the reasons why
Trisha: ఆ విషయం లో నేషనల్ క్రష్ రష్మికకు చెక్ పెట్టిన త్రిష
నెంబర్ వన్ త్రిష.. నెంబర్ టు పూజాహెగ్డే.. నెంబర్ త్రీ.. రష్మిక మందన్న... వాళ్ల వెనకే ఇంకో ముగ్గురు.. సీనియర్లు, జూనియర్లనే తేడా ఏమీ లేదు... సోషల్ మీడియాలో లాస్ట్ త్రీ డేస్ మోస్ట్ మెన్షన్డ్ నేమ్స్ వీళ్లవే మరి... గుడ్ బ్యాడ్ అగ్లీ, థగ్ లైఫ్ సినిమాల ప్రమోషన్ల కారణంగా దాదాపు 856 వేలసార్లు మెన్షన్ అయింది త్రిష పేరు.
Updated on: Apr 22, 2025 | 10:08 PM

గుడ్ బ్యాడ్ అగ్లీ, థగ్ లైఫ్ సినిమాల ప్రమోషన్ల కారణంగా దాదాపు 856 వేలసార్లు మెన్షన్ అయింది త్రిష పేరు. ఎక్స్ ప్లస్ ఇన్‌స్టాలో మూడు రోజులుగా టాప్‌లో ఉన్నారు త్రిష. రెట్రో ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు పూజా హెగ్డే.

ఆమె పేరును 645 సార్లు మెన్షన్ చేశారు నెటిజన్లు. 512 వేల సార్లు జనాలు తలుచుకున్న బ్యూటీ పేరు రష్మిక మందన్న. రష్మిక నెక్స్ట్ ప్లేస్ కొట్టేశారు సీనియర్ బ్యూటీ తమన్నా భాటియా. తెలుగులో ఆమె నటించిన ఓదెల2 రిలీజ్ అయింది.

హిందీలో రెయిడ్2లో స్పెషల్ సాంగ్ చేశారు. జాన్ అబ్రహామ్‌తో వేద తర్వాత మరోసారి జోడీ కట్టనున్నారు. ఈ విషయాలన్నీ కలిసి 501కె టైమ్స్ తమన్నా పేరు మారుమోగేలా చేశాయి.

సినిమాలు లేకపోయినా, స్పెషల్ అకేషన్లు లేకపోయినా లేడీ సూపర్‌స్టార్ నయనతార పేరును తలచుకోవడం మర్చిపోరు అభిమానులు. ఏ అకేషనూ లేకపోయినా 386 వేల సార్లు మెన్షన్ అయింది నయనతార పేరు.

సిల్వర్‌స్క్రీన్ మీద మోడ్రన్ సీత మృణాల్‌ని మనవారే కాదు, నార్త్ వాళ్లు కూడా మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటుంటారు. అందుకే 349 కె టైమ్స్ ఆమె పేరును సోషల్ మీడియాలో మెన్షన్ చేశారు. ట్రెండ్‌లో ఉండటానికి మించిన ఆనందం ఏముంది? టాప్ సిక్స్ లో మా అభిమాన తారలుండటం హ్యాపీ అంటున్నారు ఫ్యాన్స్.




