AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shameful Record: భారత్ ఓపెనింగ్ దరిద్రం.. 20 జట్లలో టీమిండియాదే అత్యంత చెత్త రికార్డు

Shameful Record: సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఎదురైన ఘోర పరాజయం టీమిండియా పరువును బజారున పడేసింది. ఈ ఓటమి తర్వాత సోషల్ మీడియాలో నెటిజన్లు భారత జట్టును ఒక ఆట ఆడుకుంటున్నారు. సెమీఫైనల్ వెళ్లడం ఇప్పుడు భారత్‌కు ఒక హిమాలయ పర్వతాన్ని ఎక్కినంత కష్టంగా మారింది.

Shameful Record: భారత్ ఓపెనింగ్  దరిద్రం.. 20 జట్లలో టీమిండియాదే అత్యంత చెత్త రికార్డు
Ishan Kishan Abhishek Sharma
Rakesh
|

Updated on: Feb 23, 2026 | 8:15 PM

Share

Shameful Record: సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఎదురైన ఘోర పరాజయం టీమిండియా పరువును బజారున పడేసింది. ఈ ఓటమి తర్వాత సోషల్ మీడియాలో నెటిజన్లు భారత జట్టును ఒక ఆట ఆడుకుంటున్నారు. సెమీఫైనల్ వెళ్లడం ఇప్పుడు భారత్‌కు ఒక హిమాలయ పర్వతాన్ని ఎక్కినంత కష్టంగా మారింది. మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలవడంతో పాటు, పాతాళానికి పడిపోయిన రన్ రేట్‌ను కూడా సరిచేసుకోవాలి. అయితే ఈ దారుణ పరిస్థితులకు ప్రధాన కారణం మన ఓపెనర్లు అని గణాంకాలు చెబుతున్నాయి. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ జోడీ ఈ వరల్డ్ కప్‌లో భారత్‌కు అతిపెద్ద భారంగా మారింది.

ఈ టీ20 వరల్డ్ కప్ 2026లో పాల్గొన్న మొత్తం 20 జట్లలో టీమిండియా ఓపెనింగ్ జోడీనే అత్యంత చెత్త ప్రదర్శన చేసింది. ఓపెనింగ్ భాగస్వామ్యంలో భారత్ సగటు కేవలం 6.8 పరుగులు మాత్రమే. మనకంటే చిన్న జట్లైన ఒమన్ (సగటు 10 పరుగులు), ఐర్లాండ్, యూఏఈ, అమెరికా జట్ల ఓపెనర్లు కూడా మనకంటే మెరుగ్గా రాణించడం సిగ్గుచేటు. ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డు, అత్యుత్తమ బ్యాటర్లు ఉన్న జట్టుకు ఇలాంటి రికార్డు రావడం నిజంగానే అభిమానుల గుండెను రగిలిస్తోంది.

మరోవైపు న్యూజిలాండ్ ఓపెనింగ్ జోడీ ఈ టోర్నీలో సూపర్ హిట్‎గా నిలిచింది. వారి ఓపెనర్లు సగటున 84 పరుగులు జోడిస్తూ అగ్రస్థానంలో ఉన్నారు. చివరికి మన తర్వాతి ప్రత్యర్థి జింబాబ్వే ఓపెనర్లు కూడా సగటున 53.33 పరుగులు సాధించి భారత్‌కు హెచ్చరికలు పంపిస్తున్నారు. ఇషాన్ కిషన్ ఒక్క మ్యాచ్‌లో కూడా శుభారంభం ఇవ్వలేకపోగా, అభిషేక్ శర్మ ఫామ్ లేమితో కొట్టుమిట్టాడుతున్నాడు. బంతిని బాదడమే లక్ష్యంగా క్రీజులోకి వస్తున్న ఈ ఇద్దరు, కనీసం పవర్ ప్లే కూడా పూర్తి చేయకుండానే పెవిలియన్ చేరుతున్నారు.

ఈ నేపథ్యంలో టీమిండియా ఓపెనింగ్ జోడీని మార్చాల్సిన సమయం ఆసన్నమైందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫామ్ లేని అభిషేక్ శర్మను పక్కన పెట్టి, సంజూ శామ్సన్‌ను ఓపెనర్‌గా పంపాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. జట్టు అసిస్టెంట్ కోచ్ కూడా రాబోయే మ్యాచ్‌లకు ముందు సంజూ పేరును పరిశీలిస్తామని హింట్ ఇచ్చారు. మరి జింబాబ్వే, వెస్టిండీస్ వంటి కీలక మ్యాచ్‌లలోనైనా ఓపెనర్లు కళ్ళు తెరుస్తారా? లేక పాత పద్ధతిలోనే చేతులెత్తేస్తారా? అనేది తేలాల్సి ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
శని, రాహు, కేతువుల ఎఫెక్ట్.. ఈ పరిహారాలతో వారికి విజయం పక్కా..!
శని, రాహు, కేతువుల ఎఫెక్ట్.. ఈ పరిహారాలతో వారికి విజయం పక్కా..!
ప్రధాని మోదీ ఇష్టంగా తినే మునగాకు పరాటా.. రోజూ ఒక్కటి తింటే ..
ప్రధాని మోదీ ఇష్టంగా తినే మునగాకు పరాటా.. రోజూ ఒక్కటి తింటే ..
సార్.. మీరేంటిలా ? ఈ టాలీవుడ్ యాక్షన్ హీరోను గుర్తు పట్టారా?
సార్.. మీరేంటిలా ? ఈ టాలీవుడ్ యాక్షన్ హీరోను గుర్తు పట్టారా?
బెంగాల్, అస్సాంలలో ముఖ్యమంత్రి ఎవరు..?
బెంగాల్, అస్సాంలలో ముఖ్యమంత్రి ఎవరు..?
'ఎమ్మెల్యే టికెట్ కోసం రూ. 5 కోట్లు అడిగారు'..: మాజీ క్రికెటర్
'ఎమ్మెల్యే టికెట్ కోసం రూ. 5 కోట్లు అడిగారు'..: మాజీ క్రికెటర్
రోజూ 15 గంటలు .. ఆ నరకం చూడలేక చంపేయమని కోరుకున్నా: సుప్రిత
రోజూ 15 గంటలు .. ఆ నరకం చూడలేక చంపేయమని కోరుకున్నా: సుప్రిత
2016 సీన్ మళ్లీ రిపీట్ అవుతుంది.. SRH కప్పు గెలవడానికి 5 కారణాలు.
2016 సీన్ మళ్లీ రిపీట్ అవుతుంది.. SRH కప్పు గెలవడానికి 5 కారణాలు.
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఆగిన రిజిస్ట్రేషన్‌లు.. ఎందుకంటే?
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఆగిన రిజిస్ట్రేషన్‌లు.. ఎందుకంటే?
పదో తరగతి అర్హతతో భారత వైమానిక దళంలో ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా
పదో తరగతి అర్హతతో భారత వైమానిక దళంలో ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా
కోలీవుడ్‌లో మారుతున్న సీన్‌.. టాలీవుడ్ హీరోలు పాగా వేస్తారా..?
కోలీవుడ్‌లో మారుతున్న సీన్‌.. టాలీవుడ్ హీరోలు పాగా వేస్తారా..?