AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moringa Paratha: ప్రధాని మోదీ ఇష్టంగా తినే మునగాకు పరాటా.. రోజూ ఒక్కటి తింటే ఆ సమస్యలన్నీ పరార్

దేశ ప్రధాని నరేంద్ర మోదీ తన ఫిట్‌నెస్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో అందరికీ తెలిసిందే. 70 ఏళ్లు దాటినా ఆయన ఎంతో ఉత్సాహంగా పని చేయడంలో ఆయన తీసుకునే ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విషయాన్ని ఆయన కూడా చాలా సార్లు చెప్పుకొచ్చారు. అయితే తాజాగా ఆయన తనకు ఎంతో ఇష్టమైన, పోషకాల గని అయిన మునగాకు పరాటా గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇంతకూ ఆ పరాటాలో ఉన్న పోషకాలేంటి. దాని వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి. దాన్ని ఇంట్లోనే సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

Moringa Paratha: ప్రధాని మోదీ ఇష్టంగా తినే మునగాకు పరాటా.. రోజూ ఒక్కటి తింటే ఆ సమస్యలన్నీ పరార్
Pm Modi's Moringa Paratha Recipe
Anand T
|

Updated on: May 05, 2026 | 6:18 PM

Share

70 ఏళ్లు దాటినా ప్రధాని మోదీ ఎప్పుడూ అంత యాక్టీవ్‌గా ఉండేందుకు ప్రధాన కారణంగా ఆయన ఫాలో అయ్యే డైట్. ఆయన మనాల ఏది పడితే అది తినరు. ఆయనకంటూ ఓ ప్రత్యేక డైట్ ఉంటుంది. దానికి ప్రత్యేక టైం కూడా ఉంటుంది. ఆయన షెడ్యూల్ చేసిన సమయంలో మాత్రమే భోజనం చేస్తారు. అందుకే ఆయన ఎప్పుడూ హెల్తీ అండ్ యాక్టీవ్‌గా ఉంటారు. అయితే మోదీ కొన్ని సార్లు తాను ఫాలో అయ్యే డౌట్‌ను ప్రజలతో పంచుకుంటారు. తాజాగా తనకు ఇష్టమైన మునగాకు పరాటా గురించి కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి తాను వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఈ పరాటాను తీసుకుంటానని ఆయన తెలిపారు.మరి ప్రధాని మెచ్చిన ఆ ఆరోగ్యకరమైన పరాటాను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

మునగాకు పరాటాకు కావలసిన పదార్థాలు

  • గోధుమ పిండి: 1 కప్పు
  • మునగాకు : 1/2 కప్పు
  • శనగపిండి: 1/4 కప్పు
  • అల్లం-వెల్లుల్లి పేస్ట్: 1 టీస్పూన్
  • సన్నతా తరిగిన పచ్చిమిర్చి: 1
  • వాము : 1/2 టీస్పూన్
  • పసుపు: 1/2 టీస్పూన్
  • ఉప్పు: తగినంత
  • నెయ్యి లేదా నూనె: కాల్చడానికి సరిపడా

మునగాకు పరాటా తయారీ విధానం:

మునగాకు పరాటా తయారు చేసుకునేందుకు మొదట అర కప్పు తాజా మునగాకులను శుభ్రంగా కడిగి, తడి లేకుండా ఆరబెట్టాలి. తర్వాత వాటిని చాలా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో గోధుమ పిండి, శనగపిండి, తరిగిన మునగాకు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, పసుపు, వాము, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి.

తర్వాత అవసరమైన మేరకు కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని మెత్తగా చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని 10 నుండి 15 నిమిషాల పాటు పక్కన పెట్టి నాననివ్వాలి. పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, చపాతీల్లా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం వేడి చేసి, నెయ్యి లేదా నూనె వేస్తూ పరాటా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కాల్చుకోవాలి.

కొందరు ఇలా కాకుండా మునగాకులకు బదులుగా, మునక్కాయలను ఉడికించి, వాటి గుజ్జును తీసి పిండిలో కలిపి ఈ పరాటాలను తయారు చేసుకొని తింటారు. అత్యధిక పోషక విలువలు కలిగిన, ప్రధాని మోదీ మెచ్చిన ఈ సూపర్ ఫుడ్ పరాటాను పెరుగు లేదా ఆవకాయతో కలిపి తీసుకుంటే రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతమయిటన్టే.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ప్రధాని మోదీ ఇష్టంగా తినే మునగాకు పరాటా.. రోజూ ఒక్కటి తింటే ..
ప్రధాని మోదీ ఇష్టంగా తినే మునగాకు పరాటా.. రోజూ ఒక్కటి తింటే ..
సార్.. మీరేంటిలా ? ఈ టాలీవుడ్ యాక్షన్ హీరోను గుర్తు పట్టారా?
సార్.. మీరేంటిలా ? ఈ టాలీవుడ్ యాక్షన్ హీరోను గుర్తు పట్టారా?
బెంగాల్, అస్సాంలలో ముఖ్యమంత్రి ఎవరు..?
బెంగాల్, అస్సాంలలో ముఖ్యమంత్రి ఎవరు..?
'ఎమ్మెల్యే టికెట్ కోసం రూ. 5 కోట్లు అడిగారు'..: మాజీ క్రికెటర్
'ఎమ్మెల్యే టికెట్ కోసం రూ. 5 కోట్లు అడిగారు'..: మాజీ క్రికెటర్
రోజూ 15 గంటలు .. ఆ నరకం చూడలేక చంపేయమని కోరుకున్నా: సుప్రిత
రోజూ 15 గంటలు .. ఆ నరకం చూడలేక చంపేయమని కోరుకున్నా: సుప్రిత
2016 సీన్ మళ్లీ రిపీట్ అవుతుంది.. SRH కప్పు గెలవడానికి 5 కారణాలు.
2016 సీన్ మళ్లీ రిపీట్ అవుతుంది.. SRH కప్పు గెలవడానికి 5 కారణాలు.
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఆగిన రిజిస్ట్రేషన్‌లు.. ఎందుకంటే?
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఆగిన రిజిస్ట్రేషన్‌లు.. ఎందుకంటే?
పదో తరగతి అర్హతతో భారత వైమానిక దళంలో ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా
పదో తరగతి అర్హతతో భారత వైమానిక దళంలో ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా
కోలీవుడ్‌లో మారుతున్న సీన్‌.. టాలీవుడ్ హీరోలు పాగా వేస్తారా..?
కోలీవుడ్‌లో మారుతున్న సీన్‌.. టాలీవుడ్ హీరోలు పాగా వేస్తారా..?
ప్రామిసరీ నోటులో ఈ తప్పులు చేస్తే.. ఇక మీ డబ్బులు..
ప్రామిసరీ నోటులో ఈ తప్పులు చేస్తే.. ఇక మీ డబ్బులు..