AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాములను ఆకర్షించే పవర్ ఫుల్‌ స్మెల్.. ఈ వాసన వస్తే కచ్చితంగా మీ ఇంట్లోకి స్నేక్స్ వస్తాయి!

Smells that attract snakes: సాధారణంగా వర్షాకాలం నివాసం కోల్పోయో, లేదా ఎండాకాలంలో చల్లదనం కోసమనో పాములు జనావాల్లోకి వస్తుంటాయి. నిజానికి పాములకు మనుషులు అంటే భయం. అయితే, మన ఇంటి పరిసరాల్లో ఉండే అస్తవ్యస్త పరిస్థితులు, చెత్తాచెదారం, వాటికి అనుకూలంగా ఉండే వాతావరణం వల్ల అవి చాలా వరకు మన ఇంటి పరిసరాల్లోకి వస్తుంటాయి. ముఖ్యంగా ఆహారం లేదా ఆశ్రయం దొరుకుతుందనే నమ్మకంతో కొన్ని రకాల వాసనలను పసిగట్టి పాములు ఇంట్లోకి వస్తాయట. కాబట్టి పాములు ఎలాంటి వాసనలకు ఆకర్షితులవుతాయో మనం తెలుసుకుందాం.

Anand T
|

Updated on: May 05, 2026 | 3:28 PM

Share
మన ఇళ్లలో ఉండే కొన్ని వాసనలు పాములను అయస్కాంతలా ఆకర్షిస్తాయట. వాటిలో ముఖ్యంగా పాములను ఆకర్షించే ప్రధాన అంశం వాటి ఆహారం. సహజంగా పాములు మనుషులు తినే ఆహారాన్ని తినవు. కానీ మనుషుతు తయారు చేసుకునే ఆహారం కోసం వచ్చే చిన్న కీటకాల వాసనలను పసిగట్టి అవి ఇంట్లోకి వస్తాయి. ఒక వేళ మీ ఇంట్లో ఎలుకలు, చిట్టెలుకలు ఎక్కువగా ఉంటే పాములు వచ్చే ఛాన్స్ ఉంది. ఎలుకల మూత్రం, మలం నుండి వచ్చే వాసనను పసిగిట్టు పాములను ఇంట్లోకి వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

1 / 5
కేవలం ఎలుకలే కాకుండా, పక్షులు, వాటి గుడ్లు అంటే కూడా పాములకు చాలా ఇష్టం. మీ ఇంటి పైకప్పు పైన లేదా కిటికీల దగ్గర పక్షులు గూళ్ళు కట్టుకున్నా, లేదా పక్షి రెట్టల వాసన ఎక్కువగా ఉన్నా పాములు అక్కడికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పక్షులకు ఆహారం వేసే అలవాటు ఉన్నవారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉంగాలి.  అలాగే ఇంటి చుట్టూ దట్టమైన పొదలు, చెట్లుకూడా ఉండకుండా చూసుకోవాలి.

2 / 5
మీ ఇంటి పరిసరాల్లో నీటి గుంతలు, చిన్నపాటి చెరువులు లేదా చేపల కుంటలు ఉంటే కూడా మీ పరిసరాల్లోకి పాములు వచ్చే అవకాశం ఎక్కవుగా ఉంటుంది. చేపలు, కప్పలు వంటి జలచరాలు అంటే పాములకు ఎంతో ఇష్టమైన ఆహారం. అలాగే, పాములు ఇతర పాములను ఆకర్షించడానికి ఫెరోమోన్లు అనే రసాయనాలను విడుదల చేస్తాయట. అంటే, మీ ఇంట్లోకి ఒకసారి ఒక పాము వచ్చిందంటే, అది వదిలి వెళ్ళిన వాసన వల్ల మరికొన్ని పాములు వచ్చే ప్రమాదం ఉంటుంది.

3 / 5
మనం ఇంట్లో పెంచుకునే పెట్స్‌కు పెట్టే ఆహారం, బయట పారేసే మాంసం వ్యర్థాలు, గుడ్డు పెంకుల వాసన కూడా పాములను ఆకర్షిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వాసనల వల్ల ముందుగా ఎలుకలు, ఇతర కీటకాలు వస్తాయి, వాటిని వేటాడుతూ పాములు కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. కాబట్టి, ఆహార వ్యర్థాలను ఎప్పుడూ మూత ఉన్న డబ్బాల్లోనే ఉంచాలి. మీ పెట్స్‌కు పెట్టే ఆహారాన్ని ఎక్కడపడితే అక్కడ పడేయకుండా జాగ్రత్తలు తీసుకుంటే పాములు ఇంట్లోకి రాకుండా చూసుకోవచ్చు.

4 / 5
పాములు మీ ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఇంటి పరిసరాలను నీటుగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. గోడలకు ఉన్న పగుళ్లను పూడ్చివేయడం, తేమను తగ్గించడం చేయాలి. అలాగే పాములకు పడని ఘాటైన వాసనలు అంటే వెల్లుల్లి, దాల్చినచెక్క, లవంగాలు, నిమ్మకాయ వంటి వాటిని ఉపయోగించి పాములను ఇంట్లోకి రాకుండా అడ్డుకోవచ్చు. పాము కనిపిస్తే భయంతో వాటిని చంపకుండా, వెంటనే స్నేక్ క్యాచర్స్‌కు సమాచారం ఇవ్వండి. ఎందకంటే అవి ఈ విశ్వంలో మనలాంటి జీవులే!

5 / 5
Follow Us