Bhu Bharathi: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్‌లకు బ్రేక్! ఎందుకంటే?
Bhu Bharathi Portal portal down: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్రవ్యాప్తంగా భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల ప్రక్రియ ఆగిపోయింది. కొత్తగా ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి పోర్టల్ సర్వర్ సాంకేతిక కారణాలతో మొరాయిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద భారీగా క్యూలు ఏర్పడ్డాయి.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. కొత్తగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి పోర్టల్ సర్వర్ సాంకేతిక కారణాలతో మొరాయిస్తున్నట్టు తెలుస్తోంది. ఉదయం నుంచే పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్‌లు నిలిచిపోయాయి. సర్వర్ డౌన్ కావడంతో రాష్ట్రంలోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద జనాలు భారీగా క్యూ కట్టారు.
సర్వర్లు పనిచేయకపోవడంతో దూరప్రాంతాల నుంచి రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోవడంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా ఆగిపోయింది. అయితే ఈ సమస్యలపై అధికారులు స్పందించారు. సర్వర్లపై ఒత్తిడి పెరగడం కారణంగానే ఈ సమస్య ఏర్పడి ఉండవచ్చని.. ఈ సమస్యలను పరిష్కరించేందుకు టెక్నికల్ టీం ఇప్పటికే పనులు మొదలు పెట్టిందని.. త్వరలోనే సమస్య పరిష్కారం అవుంతుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
పెరిగిన ధరలు
ఇదిలా ఉండగా రాష్ట్రంలో భూభారతి పోర్టల్‌లో యూజర్ చార్జీల పెంచింది ప్రభుత్వం. అయితే చార్జీల పెంపునకు ముందే కొందరు వినియోగదారులు స్లాట్లు బుక్ చేసుకున్నారు. అర్ధరాత్రి చార్జీల పెంపుతో వినియోగదారులకు ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన చార్జీలు చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
