AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గంటకు లక్షల్లో వ్యాపారం.. వాకిట్లో ఖరీదైన కార్ల క్యూ.! అప్పట్లో స్టేట్‌ను ఊపేసిన ఈమె ఎవరో తెల్సా

వెండితెరపై తన గ్లామర్‌తో కుర్రకారును ఉర్రూతలూగించిన నటి భువనేశ్వరి జీవితం ఒక సంచలనం. 'బాయ్స్' సినిమాలోని పాత్రతో పాపులర్ అయిన ఆమె, తన పిల్లి కళ్ళ చూపుతో, విభిన్నమైన నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే సినిమాల కంటే వివాదాలే ఆమెను ఎక్కువగా వార్తల్లో నిలిపాయి. సినీ గ్లామర్ వెనుక ఉన్న చీకటి కోణాలు..

గంటకు లక్షల్లో వ్యాపారం.. వాకిట్లో ఖరీదైన కార్ల క్యూ.! అప్పట్లో స్టేట్‌ను ఊపేసిన ఈమె ఎవరో తెల్సా
Tollywood
Ravi Kiran
|

Updated on: May 05, 2026 | 4:42 PM

Share

సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. బయటకి కనిపించే మెరుపుల వెనుక ఎన్నో కన్నీళ్లు, మరెన్నో చీకటి రహస్యాలు ఉంటాయి. అలాంటి ఒక వివాదాస్పద ప్రయాణమే నటి భువనేశ్వరిది. చిత్తూరులో పుట్టి, తమిళనాడులో పెరిగిన ఈ పిల్లి కళ్ళ సుందరి, చదువులో ఫస్ట్ క్లాస్ మార్కులు సాధించినా.. విధి రాత ఆమెను వెండితెర వైపు నడిపించింది. నిజానికి భువనేశ్వరి ఒక స్టార్ హీరోయిన్ అవ్వాలని కలలు కన్నారు. కానీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సరైన గైడెన్స్ లేక, తన అందాన్నే పెట్టుబడిగా మార్చుకోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. ఒక పెద్ద నిర్మాత అండతో ఆమె కెరీర్ మొదలైనా, అది ఆమెను సరైన మార్గంలో ఉంచలేకపోయింది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘బాయ్స్’ సినిమాలో ఆమె చేసిన వేశ్య పాత్ర ఎంతలా పాపులర్ అయ్యిందంటే, ఆ తర్వాత ఆమెకు అలాంటి పాత్రలే ఎక్కువగా వచ్చాయి. ‘దొంగరాముడు అండ్ పార్టీ’ వంటి సినిమాల్లో ఆమె తనదైన శైలిలో కామెడీని పండించి ప్రేక్షకులను అలరించారు.

కానీ సినిమా కథ కంటే ఆమె నిజ జీవితమే ఎక్కువ మలుపులు తిరిగింది. ఒక పక్క నటిగా రాణిస్తూనే, మరోపక్క రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం ఆమె జీవితాన్ని వివాదాల మయం చేసింది. ముఖ్యంగా వ్యభిచారం కేసుల్లో ఆమె మూడుసార్లు అరెస్టవ్వడం అప్పట్లో దక్షిణాది ఇండస్ట్రీని కుదిపేసింది. 2009లో అరెస్ట్ అయిన సమయంలో ఆమె కోర్టులో చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టించాయి. “కేవలం నన్నే ఎందుకు పట్టుకుంటున్నారు? ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా వెలుగుతున్న వారు కూడా ఇదే పని చేస్తున్నారు కదా” అని ఆమె ప్రశ్నించడం కోలీవుడ్ పెద్దలను షాక్‌కు గురిచేసింది.

కేవలం వృత్తిపరంగానే కాకుండా, వ్యక్తిగత జీవితంలో కూడా ఆమె ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. భర్త వదిలేసి వెళ్లడం, కొడుకు మిథున్ శ్రీనివాసన్ కూడా కొన్ని కేసుల్లో ఇరుక్కోవడం ఆమెను మరింత మానసిక వేదనకు గురిచేశాయి. పోలీస్ ఆఫీసర్ కాలర్ పట్టుకున్నారనే ఆరోపణలు కూడా ఆమె ఇమేజ్‌ను దెబ్బతీశాయి. మొత్తం మీద చూస్తే, భువనేశ్వరి జీవితం ఒక సినిమా కథలాంటిదే.. అందులో గ్లామర్ ఉంది, సక్సెస్ ఉంది, అంతకు మించి కోలుకోలేని వివాదాలు ఉన్నాయి.

Follow Us
డయాబెటిస్, అధిక బరువును ఇట్టే తగ్గించే సూపర్‌ఫుడ్..
డయాబెటిస్, అధిక బరువును ఇట్టే తగ్గించే సూపర్‌ఫుడ్..
సంకల్ప బలంతో అసాధ్యమేదీ కాదు.. మోరిస్ గుడ్‌మాన్‌ కథ మీకు చెప్పాలి
సంకల్ప బలంతో అసాధ్యమేదీ కాదు.. మోరిస్ గుడ్‌మాన్‌ కథ మీకు చెప్పాలి
డిజిటల్ చెల్లింపులు పెరిగినా నగదుకు తగ్గని డిమాండ్.. భారత్‌లో..
డిజిటల్ చెల్లింపులు పెరిగినా నగదుకు తగ్గని డిమాండ్.. భారత్‌లో..
రైతన్నలూ.. మెరుగైన ఆదాయం కావాలంటే ఈ సలహాలు పాటించండి..
రైతన్నలూ.. మెరుగైన ఆదాయం కావాలంటే ఈ సలహాలు పాటించండి..
టీనేజర్ల కోసం స్పెషల్ ChatGPT వెర్షన్‌.. దండిగా సేఫ్టీ ఫీచర్లు!
టీనేజర్ల కోసం స్పెషల్ ChatGPT వెర్షన్‌.. దండిగా సేఫ్టీ ఫీచర్లు!
పీరియడ్స్ వచ్చాయా.? అంటూ నీచంగా మాట్లాడేవాడు..
పీరియడ్స్ వచ్చాయా.? అంటూ నీచంగా మాట్లాడేవాడు..
గ్యాస్ ట్రబుల్ ను తగ్గించి పేగులను క్లీన్ చేసే హై ప్రోటీన్ కూర
గ్యాస్ ట్రబుల్ ను తగ్గించి పేగులను క్లీన్ చేసే హై ప్రోటీన్ కూర
ఈ జామ రైతు సక్సెస్ సీక్రెట్ తెలిస్తే.. మీరూ ఫాలో అవుతారు..
ఈ జామ రైతు సక్సెస్ సీక్రెట్ తెలిస్తే.. మీరూ ఫాలో అవుతారు..
తెలుగు యువతకు జర్మనీలో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.3.30లక్షల జీతం
తెలుగు యువతకు జర్మనీలో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.3.30లక్షల జీతం
శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ రికార్డులు బ్రేక్ చేసిన పంత్
శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ రికార్డులు బ్రేక్ చేసిన పంత్