హనుమకొండ జిల్లా చింతల్ తండాలో పొలం నుండి గడ్డితో వెళ్తున్న ట్రాక్టర్కు ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలు తగలడంతో మంటలు చెలరేగి గడ్డితో పాటు ట్రాక్టర్ ట్రాలీ పూర్తిగా కాలిపోయింది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, భారీ నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.