AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రెండింగ్‌లో విజయ్‌, త్రిష.. వీరిద్దరిలో ఎవరు ఎక్కువ చదువుకున్నారో తెలుసా..?

Vijay and Trisha: విజయ్‌, త్రిష పేర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. విజయ్ సారథ్యంలోని టీవీకే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించింది. త్రిష పుట్టిన రోజున విజయ్ సాధించిన ఈ సంచలన విజయం.. అందరి మధ్య చర్చనీయాంశంగా మారింది. వారిద్దరి మధ్య ఉన్న అనుబంధంపై సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చే జరుగుతోంది. ఇద్దరి మధ్య ఉన్నది జస్ట్ స్నేహమా? అందకు మించా? అన్న అంశంపైనే తమిళ తంబీలు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. వారిద్దరి విద్యార్హతలు కూడా చర్చకు వస్తోంది.

ట్రెండింగ్‌లో విజయ్‌, త్రిష.. వీరిద్దరిలో ఎవరు ఎక్కువ చదువుకున్నారో తెలుసా..?
Vijay, Trisha
Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: May 05, 2026 | 4:44 PM

Share

విజయ్, త్రిష్.. ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న పేర్లు ఇవి. త్రిష పుట్టినరోజున విజయ్‌ ఎన్నికల్లో గెలిస్తే… సోషల్‌ మీడియాలో పుష్ప సీన్‌ని షేర్‌ చేసి హ్యాపీగా ఫీలవుతున్నారు అభిమానులు. భార్య పుట్టినరోజున సీఎం పదవీ ప్రమాణాన్ని ఏర్పాటు చేసిన పుష్పరాజ్‌ సీన్‌ ఇప్పుడు తెగ వైరల్‌ అవుతోంది. సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నది త్రిష పేరు, పుష్ప సీన్‌ మాత్రమే కాదు. ‘పుట్టినరోజు త్రిష’ అని చెబుతూనే ది బెస్ట్ సెలబ్రేషన్స్ చేసుకోమంటూ ఛార్మి, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, లక్ష్మీ మంచు పెట్టిన పోస్టులు కూడా!

అసలు త్రిష – విజయ్‌ మధ్య ఉన్నది స్నేహమా? ప్రేమా? అంతకు మించిన బంధమా? రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. విజయ్‌కి ఆయన సతీమణి విడాకులు ఇవ్వడానికి కారణం ఓ నటి అన్నది జరమెరిగిన సత్యం. ఆ నటీమణి త్రిష అంటూ రకరకాల వార్తలు. వాటికి ఆజ్యం పోస్తూ త్రిష – విజయ్‌ ఓపెన్‌గా సొసైటీలో కలిసి మెలిసి కనిపించారు. తమ మధ్య ఉన్న పరిచయాన్నీ , స్నేహాన్నీ ఎప్పుడూ దాచడానికి ప్రయత్నించలేదు ఈ జంట. అంతెందుకు ‘లియో’ వేడుకలో త్రిష స్టేజ్‌ మీద మాట్లాడుతూ ‘విజయ్‌’ అంటూ పిలిచిన తీరు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. ‘విజయ్‌కి హోమ్‌ అనేది ప్లేస్‌ కాదని, ఒక వ్యక్తి’ అని ఆ వేడుకలో ఓపెన్‌ అయ్యారు త్రిష. తనకు ‘లియో’ సెట్‌ అలాంటి హ్యాపీ హోమ్‌ అని… తాను కూడా విజయ్‌లాగానే ఆలోచిస్తున్నానని చెప్పకనే చెప్పేశారు స్మైలింగ్‌ క్వీన్‌. అంతటితో ఆగకుండా తన సినిమా కెరీర్‌లో అత్యంత లాంగ్‌ టర్మ్ జర్నీ ఉన్నది విజయ్‌తోనే అని డిక్లేర్‌ చేశారు. స్కూల్లో చదివిన ఫ్రెండ్‌ మళ్లీ కలిసినప్పుడు ఎంత సరదాగా అనిపిస్తుందో, విజయ్‌తో ఉన్నంత సేపూ తనకు యాజ్‌ ఇట్‌ ఈజ్‌ గా అలాగే అనిపిస్తుందని అన్నారు.

త్రిష స్కూల్‌ ఫ్రెండ్‌ తో విజయ్‌ని పోల్చగానే…. చెన్నైలో పెరిగిన వీరిద్దరు గతంలో ఎక్కడైనా కలిసి చదువుకున్నారా? అని ఆరా తీసేవారు కూడా లేకపోలేదు. త్రిష ఎతిరాజ్‌ కాలేజ్‌లో బీబీఏని పూర్తి చేయగా, విజయ్‌.. లయోలా కాలేజ్‌ నుంచి విజువల్‌ కమ్యూనికేషన్‌ డిగ్రీని డిస్‌కంటిన్యూ చేశారనే విషయం కూడా ఇప్పుడు ట్రెండ్‌ అవుతోంది.

విజయ్‌ ఎన్నికల్లో గెలిచిన వేళ, త్రిష నేరుగా విజయ్‌ ఇంటికి వెళ్లడం కూడా తమిళనాడులో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆమె విజయ్‌ పార్టీలో చేరతారా? ఆయన రాజీనామా చేసే స్థానం నుంచి పోటీ చేస్తారా? ఆయన సంగీతకు విడాకులు ఇస్తే వివాహ బంధంతో ఒక్కటవుతారా? లేకుంటే అన్నాడీఎంకే పార్టీలో ఎంజీఆర్‌తో పాటు జయలలిత ఉన్నట్టే.. టీవీకేలో విజయ్‌తో త్రిష ఉంటారా? ఇలాంటివన్నీ ఇప్పుడు త్రిష పేరుతో పాటు ట్రెండింగ్‌లో ఉన్న వార్తలు.

Follow Us