భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్ణశాలలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీబత్సం సృష్టించింది. గోదావరి తీరంలోని రేకుల షెడ్లు కూలిపోగా, భక్తులు భయంతో పరుగులు తీశారు. ఆలయ మార్గంలోని బొమ్మల దుకాణాలు కొట్టుకుపోవడంతో స్థానిక వ్యాపారులు నష్టపోయారు. ఈ ప్రకృతి ప్రకోపంతో పర్యాటక ప్రాంతంలో గందరగోళ పరిస్థితి నెలకొంది.