IPL 2026: అదరగొట్టిన అన్‌సంగ్ హీరోలు.. ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో ఓవర్ నైట్ స్టార్లుగా!
Young Players in IPL 2026: క్రికెట్ ప్రపంచంలో నిలకడగా రాణించడం అందరికీ సాధ్యం కాదు. కానీ, జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆపద్బాంధవుడిలా ఆదుకుని, అద్భుతమైన ఇన్నింగ్స్‌తో విజయాన్ని అందించే వారు అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఐపీఎల్ 2026 సీజన్‌లో కూడా అంచనాలు లేకుండా వచ్చి, తమ 'సింగిల్ ఇన్నింగ్స్' ప్రదర్శనతో ప్రకంపనలు సృష్టించిన యువ కెరటాల గురించి ప్రత్యేక కథనం.

Young Players in IPL 2026: ఐపీఎల్ వేదిక ఎంతో మంది అనామక ఆటగాళ్లను రాత్రికి రాత్రే స్టార్లుగా మార్చింది. 2026 సీజన్‌లో కూడా పలువురు యువ ఆటగాళ్లు తమ అద్భుత బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. స్టార్ ప్లేయర్లు విఫలమైన చోట, ఒత్తిడిని చిత్తు చేస్తూ వీరు ఆడిన ఇన్నింగ్స్‌లు ఆయా జట్లకు ప్రాణవాయువుగా మారాయి. పరుగుల వరద పారించిన ఈ ‘సింగిల్ ఇన్నింగ్స్’ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
సీఎస్‌కే ఆశాకిరణం కార్తిక్ శర్మ: బుమ్రా, పాండ్యా బౌలింగ్‌లోనే ధీటుగా..
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఎప్పుడూ కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడంలో ముందుంటుంది. ఈ సీజన్‌లో కార్తిక్ శర్మ రూపంలో మరో వజ్రం దొరికింది. ముంబయి ఇండియన్స్‌తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా వంటి హేమాహేమీలను ఎదుర్కొని కార్తిక్ ఆడిన తీరు అమోఘం. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు అండగా నిలిచి, కీలక హాఫ్ సెంచరీతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. భయం లేకుండా అతను బాదిన షాట్లు భవిష్యత్తు స్టార్‌ను సూచిస్తున్నాయి.
పంజాబ్ కింగ్స్ సెన్సేషన్ సూయాంశ్ షెడ్గే..
పంజాబ్ కింగ్స్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన సూయాంశ్ షెడ్గే విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కేవలం 29 బంతుల్లోనే 57 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. జట్టు ఓడిపోయినా, సూయాంశ్ తన అద్భుత పోరాటంతో క్రికెట్ పండితుల ప్రశంసలు అందుకున్నాడు.
సమీర్ రిజ్వీ: ధోని శిష్యరికం నుంచి ఢిల్లీ డెవలప్‌మెంట్ వరకు..
గతంలో చెన్నై జట్టులో ఎంఎస్ ధోని పర్యవేక్షణలో రాటుదేలిన సమీర్ రిజ్వీ, ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున మెరుపులు మెరిపిస్తున్నాడు. ముంబయిపై 90 పరుగుల భారీ ఇన్నింగ్స్‌తో ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. లఖ్‌నవూపై కూడా 70 పరుగులు చేసి తన సత్తా చాటాడు. క్రీజులో కుదురుకోవడానికి సమయం తీసుకున్నా, ఒక్కసారి గేర్ మారిస్తే అతన్ని ఆపడం ఎవరి తరమూ కాదని నిరూపించాడు.
ముకుల్ చౌదరి ‘హెలికాప్టర్’ మేజిక్..
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఈ సీజన్‌లో తడబడుతున్నా, ముకుల్ చౌదరి ఇన్నింగ్స్ మాత్రం హైలైట్‌గా నిలిచింది. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముకుల్ (54*) అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. ముఖ్యంగా అతను ఆడిన ఆఫ్‌సైడ్ ‘హెలికాప్టర్ షాట్’ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ధోని స్టైల్‌లో అతను బాదిన షాట్లు అభిమానులకు కనువిందు చేశాయి.
రియాన్ పరాగ్: విమర్శల మధ్య మెరిసిన కెప్టెన్ ఇన్నింగ్స్..
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఈ సీజన్‌లో అనేక విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను ఆడిన ఇన్నింగ్స్ మరువలేనిది. ఓపెనర్లు విఫలమై జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు 50 బంతుల్లో 90 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. మ్యాచ్ ఫలితం అనుకూలంగా రాకపోయినా, పరాగ్ పోరాటపటిమను ఎవరూ కాదనలేరు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
