AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAK vs ENG Preview: పాక్ జట్టుకు మరో షాక్ తగలనుందా.. ఎందుకో తెలుసా?

Pakistan vs England Super 8 prediction: ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ జట్లు సూపర్ 8 లో భాగంగా రేపు తలపడనున్నాయి. ఇప్పటికే ఇంగ్లండ్ జట్లు తొలి మ్యాచ్ గెలిచి, దూకుడుగా ఉంది. అయితే, పాకిస్తాన్ జట్టు ఆడిన తొలి మ్యాచ్ మాత్రం వర్షంతో రద్దైంది.

PAK vs ENG Preview: పాక్ జట్టుకు మరో షాక్ తగలనుందా.. ఎందుకో తెలుసా?
Pak Vs Eng Prediction, Super 8
Venkata Chari
|

Updated on: Feb 23, 2026 | 7:54 PM

Share

Pakistan vs England Super 8 prediction: ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్–8 దశలో పాకిస్థాన్ vs ఇంగ్లాండ్ (PAK vs ENG) మధ్య కీలక మ్యాచ్ ఫిబ్రవరి 24న సాయంత్రం 7 గంటలకు పల్లెకెలే ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. సూపర్–8లో పాకిస్థాన్ తొలి మ్యాచ్ న్యూజిలాండ్‌తో వర్షం కారణంగా ఒక్క బంతి కూడా వేయకుండానే రద్దయ్యింది. ఆ మ్యాచ్‌లో ఇరు జట్లకు చెరో ఒక్క పాయింట్ లభించింది.

మరోవైపు, ఇంగ్లాండ్ అదే వేదికపై శ్రీలంకపై 51 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 147 పరుగులు డిఫెండ్ చేస్తూ శ్రీలంకను కేవలం 95 పరుగులకే ఆలౌట్ చేసింది.

ప్రస్తుత ఫామ్ (గత 5 టీ20ఐలు)..

పాకిస్థాన్: విజయం, విజయం, ఓటమి, విజయం, ఫలితం లేదు

ఇంగ్లాండ్: విజయం, ఓటమి, విజయం, విజయం, విజయం

వీళ్ల పోరు చూడాల్సిందే..

సాహిబ్‌జాదా ఫర్హాన్ vs జోఫ్రా ఆర్చర్..

ఈ టోర్నమెంట్‌లో సాహిబ్‌జాదా ఫర్హాన్ 220 పరుగులతో టాప్ రన్–స్కోరర్‌గా ఉన్నాడు (స్ట్రైక్ రేట్ 164.17). టాప్–3లో మిగతా ఇద్దరు బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. ఫర్హాన్‌ను పవర్‌ప్లేలో తొందరగా ఔట్ చేయగలిగితే పాకిస్థాన్‌పై ఒత్తిడి పెరుగుతుంది. ఫర్హాన్‌కు రైట్ షోల్డర్ వైపు వచ్చే షార్ట్ బాల్స్‌పై కొంత ఇబ్బంది కనిపిస్తోంది. పవర్‌ప్లేలో 7 వికెట్లతో ఈ టోర్నమెంట్‌లో లీడింగ్ వికెట్–టేకర్ అయిన జోఫ్రా ఆర్చర్‌తో ఈ పోరు మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించవచ్చు.

విల్ జాక్స్ vs ఉస్మాన్ తారిక్..

ఇంగ్లాండ్ ఫినిషర్ విల్ జాక్స్ దూకుడు ఫినిష్‌లతో జట్టుకు కీలకంగా మారాడు. మూడు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. స్ట్రైక్ రేట్ 195.52గా ఉంది. అతడు బ్యాటింగ్ చేసే చివరి ఓవర్లలో మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ చేయనున్నాడు. ఈ బ్యాటిల్ మ్యాచ్‌ను మ్యాచ్ స్వరూపాన్నే మార్చగలదు.

బాబర్ ఆజమ్ vs ఆదిల్ రషీద్..

మిడిల్ ఆర్డర్‌లో ఆడుతున్న బాబర్ ఆజమ్‌కు ఈ పాత్ర అంత సౌకర్యంగా లేదు. స్పిన్‌కు అనుకూల పరిస్థితుల్లో ఆదిల్ రషీద్ వెరియేషన్లతో బాబర్‌ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇప్పటివరకు 11 టీ20ఐల్లో బాబర్‌ను రషీద్ 4 సార్లు ఔట్ చేశాడు. ఈ ఫేజ్ మ్యాచ్‌లో కీలకం కానుంది.

PAK vs ENG టాప్ స్కోర్స్ చేసిన ప్లేయర్లు..

పాక్ ఆటగాళ్లలో:

బాబర్ ఆజమ్ – ఇంగ్లాండ్‌పై 18 టీ20ఐల్లో 660 పరుగులు (SR 141.02), 4 అర్ధశతకాలు, 1 శతకం

షాదాబ్ ఖాన్ – 12 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు (ఎకానమీ 9.22), బెస్ట్ 3/17

ఇంగ్లాండ్ ఆటగాళ్లలో:

జోస్ బట్లర్ – పాకిస్థాన్‌పై 11 మ్యాచ్‌ల్లో 297 పరుగులు (SR 138.13), 2 అర్ధశతకాలు

ఆదిల్ రషీద్ – పాకిస్థాన్‌పై 21 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు (ఎకానమీ 7.76), బెస్ట్ 4/35

టాస్ ప్రిడిక్షన్..

2026లో పల్లెకెలే పిచ్‌పై భారీ స్కోర్లు పెద్దగా నమోదు కాలేదు. స్పిన్నర్లు దాదాపు ప్రతి మ్యాచ్‌లో ప్రభావం చూపారు. ఇక్కడ ఆడిన 7 మ్యాచ్‌ల్లో 3 మ్యాచ్‌లు ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. ఇంగ్లాండ్ ఈ వేదికపై తక్కువ స్కోర్లను కూడా విజయవంతంగా డిఫెండ్ చేసింది. పాకిస్థాన్ కూడా ఈ పరిస్థితుల్లో బలమైన బౌలింగ్‌తో స్కోర్లను కాపాడగల సామర్థ్యం కలిగి ఉంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ చేయాలని అనుకోవచ్చు.

టాప్ ప్లేయర్స్ ప్రిడిక్షన్..

పాకిస్థాన్ (PAK):

ఉత్తమ బ్యాటర్లు: సాహిబ్‌జాదా ఫర్హాన్, షాదాబ్ ఖాన్

ఉత్తమ బౌలర్లు: మొహమ్మద్ నవాజ్, ఉస్మాన్ తారిక్

ఇంగ్లాండ్ (ENG):

ఉత్తమ బ్యాటర్లు: జేకబ్ బెతెల్, టామ్ బాంటన్

ఉత్తమ బౌలర్లు: విల్ జాక్స్, ఆదిల్ రషీద్

ఎక్కువ సిక్సర్లు కొట్టే అవకాశం: జేకబ్ బెతెల్

ఎక్కువ ఫోర్లు కొట్టే అవకాశం: టామ్ బాంటన్

మ్యాచ్ ఎవరు గెలుస్తారు?

శ్రీలంకలో ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన పాకిస్థాన్‌కు ఇక్కడి పరిస్థితులపై అవగాహన ఉంది. అయితే ఇంగ్లాండ్ కూడా గత నెలన్నరగా ఉపఖండంలోనే ఎక్కువగా ఆడింది. పల్లెకెలేలో అనేక మ్యాచ్‌ల అనుభవం సంపాదించింది. జట్ల బలం, బలమైన ప్రత్యర్థులపై ప్రదర్శనను పరిగణలోకి తీసుకుంటే, ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌కు స్వల్ప ఆధిక్యం ఉంది. సూపర్–8లో సెమీఫైనల్ బెర్త్‌ను ముందుగానే ఖాయం చేసుకునే అవకాశమూ ఇంగ్లాండ్‌కే ఎక్కువగా కనిపిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us