Raghu Sharma IPL 2026 : 15 ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. వికెట్ తీశాక జేబులోంచి చిట్టీ తీసిన రఘు శర్మ.. అందులో ఏముందో తెలుసా ?
Raghu Sharma IPL 2026 : ఐపీఎల్ 2026 లో ముంబై బౌలర్ రఘు శర్మ తొలి వికెట్ తీసిన తర్వాత జేబులోంచి చిట్టీ తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో 13వ ఓవర్లో అక్షత్ రఘువంశీని అవుట్ చేసిన తర్వాత రఘు శర్మ తన జేబులో నుంచి ఒక పేపర్ ముక్కను తీశాడు. రఘు శర్మ పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన ఆటగాడు.

Raghu Sharma IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ అనేక అద్భుతమైన ఘట్టాలకు వేదికగా మారుతోంది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ యువ స్పిన్నర్ రఘు శర్మ తన కెరీర్‌లో తొలి ఐపీఎల్ వికెట్ తీసిన తర్వాత జరుపుకున్న వేడుక ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో రఘు శర్మ ప్రదర్శించిన ఈ చిట్టీ సెలబ్రేషన్ వెనుక 15 ఏళ్ల నిరీక్షణ, ఒక ఎమోషనల్ జర్నీ దాగి ఉంది. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో 13వ ఓవర్లో అక్షత్ రఘువంశీని అవుట్ చేసిన తర్వాత రఘు శర్మ తన జేబులో నుంచి ఒక పేపర్ ముక్కను తీశాడు. అందులో ఇలా రాసి ఉంది.. “రాధే రాధే.. గురువుగారి కృపతో 15 ఏళ్ల నా కష్టకాలం ముగిసింది. ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు ముంబై ఇండియన్స్ (బ్లూ అండ్ గోల్డ్)కు చాలా కృతజ్ఞతలు. నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. జై శ్రీరామ్.” తన సుదీర్ఘ నిరీక్షణకు, పడ్డ కష్టానికి ఐపీఎల్ వికెట్ రూపంలో దక్కిన గుర్తింపును రఘు శర్మ ఇలా దైవానికి, తన జట్టుకు అంకితమిచ్చాడు.
ఎవరీ రఘు శర్మ?
రఘు శర్మ పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన ఆటగాడు. 1993లో జన్మించిన ఈ 33 ఏళ్ల స్పిన్నర్ దేశవాళీ క్రికెట్‌లో పంజాబ్ తరపున ఆడుతున్నాడు. ఇతడిని ముంబై ఇండియన్స్ 2025 వేలంలో రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. గత సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్‌పై అరంగేట్రం చేసినా వికెట్ తీయలేకపోయాడు. కానీ తన రెండో మ్యాచ్‌లోనే లక్నో బ్యాటర్‌ను బోల్తా కొట్టించి తన కలని నెరవేర్చుకున్నాడు. రఘు ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో ఇప్పటివరకు 20 ఇన్నింగ్స్‌ల్లో 57 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు.
ముంబై గెలుపు – రోహిత్ విధ్వంసం
ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 229 పరుగుల భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. రఘు శర్మ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్‌తో కలిసి తొలి వికెట్‌కు 143 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రోహిత్ శర్మ కేవలం 5 సిక్సర్లతో మెరుపు హాఫ్ సెంచరీ బాదాడు. రఘు శర్మ బౌలింగ్‌లో రాణించడమే కాకుండా, రోహిత్ తన బ్యాటింగ్‌తో ముంబైకి 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందించాడు.
#RaghuSharma makes a statement with that wicket 🔥
Years of hard work and belief are finally paying off. 💙🙌🏻#TATAIPL Revenge Week 2026 ➡️ #MIvLSG | LIVE NOW 👉https://t.co/hc4PVkY1Pc pic.twitter.com/QFbQB1OeRg
— Star Sports (@StarSportsIndia) May 4, 2026
15 ఏళ్ల నిరీక్షణకు దక్కిన గౌరవం
రఘు శర్మ ఈ స్థాయికి చేరడానికి దాదాపు 15 ఏళ్ల పాటు తీవ్రంగా శ్రమించాడు. దేశవాళీ క్రికెట్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. వయస్సు 30 దాటినా పట్టువదలకుండా ప్రయత్నించి ముంబై ఇండియన్స్ లాంటి పెద్ద జట్టులో చోటు సంపాదించుకున్నాడు. ఐపీఎల్ అనేది కేవలం గ్లామర్ మాత్రమే కాదు.. రఘు శర్మ లాంటి ఎందరో టాలెంటెడ్ పేద, మధ్యతరగతి క్రికెటర్ల కలల వేదిక అని ఈ ఘటన మరోసారి నిరూపించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
