AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hardik Pandya : చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో హార్దిక్, మహికా సందడి..రొమాన్స్ పీక్స్‌లో ఉంది కానీ..నలుగురిలో ఏంటి భయ్యా ఇది

Hardik Pandya : టీ20 వరల్డ్ కప్ 2026 రసవత్తరంగా సాగుతున్న తరుణంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మైదానంలో కంటే మైదానం బయటే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. హార్దిక్ పాండ్యా తన కొత్త గర్ల్‌ఫ్రెండ్, నటి మహికి శర్మతో రిలేషన్‌లో ఉన్నాడనే వార్తలు ఇప్పుడు అధికారికంగా ధ్రువీకరించబడినట్లు కనిపిస్తోంది.

Hardik Pandya : చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో హార్దిక్, మహికా సందడి..రొమాన్స్ పీక్స్‌లో ఉంది కానీ..నలుగురిలో ఏంటి భయ్యా ఇది
Hardik Pandya
Rakesh
|

Updated on: Feb 23, 2026 | 7:32 PM

Share

Hardik Pandya : టీ20 వరల్డ్ కప్ 2026 రసవత్తరంగా సాగుతున్న తరుణంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మైదానంలో కంటే మైదానం బయటే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. హార్దిక్ పాండ్యా తన కొత్త గర్ల్‌ఫ్రెండ్, నటి మహికి శర్మతో రిలేషన్‌లో ఉన్నాడనే వార్తలు ఇప్పుడు అధికారికంగా ధ్రువీకరించబడినట్లు కనిపిస్తోంది. టోర్నీ ప్రారంభం నుంచి టీమిండియా ఎక్కడికి వెళ్తే మహికి అక్కడే ప్రత్యక్షమవుతోంది. తాజాగా భారత జట్టు తన తదుపరి మ్యాచ్ కోసం చెన్నై చేరుకోగా, ఎయిర్‌పోర్ట్‌లో హార్దిక్ తన ప్రియురాలి భుజంపై చేయి వేసి నడుస్తున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో వీరిద్దరి ప్రేమాయణం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

వ్యక్తిగత జీవితం సంగతి పక్కన పెడితే, హార్దిక్ పాండ్యా ఆటతీరుపై మాత్రం తీవ్ర విమర్శలు వ్యప్తమవుతున్నాయి. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన సీనియర్ ప్లేయర్, మైదానంలో మాత్రం చేతులెత్తేస్తున్నాడనే ఆగ్రహం అభిమానుల్లో కనిపిస్తోంది. గ్రూప్ స్టేజ్‌లో నమీబియా వంటి చిన్న జట్టుపై ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన హార్దిక్, అసలైన సూపర్ 8 పోరులో మాత్రం విఫలమయ్యాడు. సౌతాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్‌లో బౌలింగ్‌లో 4 ఓవర్లలో ఏకంగా 45 పరుగులు సమర్పించుకోవడమే కాకుండా, బ్యాటింగ్‌లో కూడా 17 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి ఒత్తిడిలో నిలబడలేకపోయాడు.

హార్దిక్ పాండ్యా తన ప్రియురాలి పుట్టినరోజు వేడుకలను కూడా అహ్మదాబాద్‌లోని టీమ్ హోటల్‌లో ఘనంగా నిర్వహించాడు. జట్టులోని ఇతర సభ్యులు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే, అభిమానుల ప్రశ్న మాత్రం ఒక్కటే.. రొమాన్స్ ఓకే.. కానీ టీమిండియాను ఎప్పుడు గెలిపిస్తావు హార్దిక్?. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన పాండ్యా, ఇప్పటివరకు పెద్ద జట్లపై తన మార్కు చూపించలేకపోయాడు. బౌలింగ్‌లో పరుగులు నియంత్రించలేకపోవడం, బ్యాటింగ్‌లో స్ట్రైక్ రేట్ మందగించడం జట్టు విజయవకాశాలను దెబ్బతీస్తోంది.

తదుపరి మ్యాచ్ జింబాబ్వేతో చెన్నైలోని చేపాక్ స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే మహికా శర్మ చెన్నై చేరుకోవడంతో, ఈ మ్యాచ్‌లోనైనా హార్దిక్ బ్యాట్‌తో లేదా బంతితో విన్యాసాలు చేస్తాడో లేదో చూడాలి. ఒక ప్రొఫెషనల్ క్రికెటర్‌గా తన ప్రధాన బాధ్యత దేశాన్ని గెలిపించడమేనని హార్దిక్ గుర్తించాలని మాజీ క్రికెటర్లు సైతం సూచిస్తున్నారు. మరి జింబాబ్వేపై అయినా ఈ స్టార్ ప్లేయర్ తన పాత ఫామ్ అందుకుని విమర్శకుల నోళ్లు మూయిస్తాడో లేదో వేచి చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us