AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఇదేం ట్విస్ట్.. హీరోయిన్‌గా పీక్స్ లో కెరీర్.. సడెన్‌గా సినిమాలకు బ్రేక్ ప్రకటించిన టాలీవుడ్ బ్యూటీ

ప్రస్తుతం ఈ టాలీవుడ్ హీరోయిన్ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. సినిమాలు, వెబ్ సిరీస్ లంటూ బిజీ బిజీగా ఉంటోంది. అయితే ఉన్నట్లుండి ఈ ముద్దుగుమ్మ సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

Tollywood: ఇదేం ట్విస్ట్.. హీరోయిన్‌గా పీక్స్ లో కెరీర్.. సడెన్‌గా సినిమాలకు బ్రేక్ ప్రకటించిన టాలీవుడ్ బ్యూటీ
Tollywood Actress
Basha Shek
|

Updated on: May 05, 2026 | 3:22 PM

Share

‘మా ఊరి పొలిమేర’ సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. దీని తర్వాత పలు సినిమాల్లోనూ హీరోయిన్ గా చేసిందీ అందాల తార. అలాగే కొన్ని సినిమాల్లో సహాయక నటిగానూ మెప్పించింది. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, రౌడీ బాయ్స్, విరూపాక్ష, మా ఊరి పొలిమేర 2, మిక్స్ అప్, ఓం భీమ్ బుష్, లైలా, షో టైమ్, 12 ఏ రైల్వే కాలనీ, మాన్షన్ హౌస్ మల్లేష్ తదితర సినిమాల్లో కామాక్షి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇటీవల అడివి శేష్ హీరోగా నటించిన డెకాయిట్: ఏ లవ్ స్టోరీ సినిమాలోనూ ఓ కీ రోల్ పోషించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో అగధ, మా ఊరి పొలిమేర 3 సినిమాలతో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. సినిమాలకు విరామం ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మేరకు కామాక్షి సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

‘  సినిమాలు, నటన మీద విసుగు వచ్చి నేను ఈ బ్రేక్ తీసుకోవడం లేదు. కేవలం నా మానసిక ఆరోగ్యానికి, స్వీయ సంరక్షణకు మరింత  ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాను. ప్రస్తుతం నాకు ఎలాంటి తొందర లేదు. ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటూ, నా ఉనికిని నేను గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను. కొన్నిసార్లు మన లక్ష్యాలను మరింత ఉత్సాహంగా చేరుకోవాలంటే, కొంచెం వెనక్కి తగ్గాలి. మరింత శక్తిని కూడగట్టుకోవాలి. అందుకే ఈ చిన్న విరామం.. కానీ నేను ఎక్కడికీ వెళ్లిపోలేదు, త్వరలోనే మీ ముందుకు మళ్లీ వస్తాను” అని తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ పెట్టింది కామాక్షి.

కామాక్షి భాస్కర్ల ఎమోషనల్ పోస్ట్..

ఈ టాలీవుడ్ బోల్డ్ బ్యూటీ షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఉన్నట్లుండి కామాక్షి భాస్కర్ల సినిమాలకు ఎందుకు బ్రేక్ ఇచ్చిందని నెటిజన్లు ఆందోళన చెందుతున్నారు.

 అడివి శేష్ డెకాయిట్ సినిమాలో కామాక్షి భాస్కర్ల

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us