ఏదోక రోజు తమిళనాడు సీఎం అవుతా.. త్రిష 20 ఏళ్ల కల.. ఓల్డ్ వీడియో..

Rajitha Chanti

Pic credit - Instagram

04 May 2026

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ్ పార్టీ టీవీకే భారీ విజయం సాధించింది. కొన్ని సంవత్సరాలుగా తమిళనాడు రాజకీయాలను శాసిస్తున్న డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు షాకిచ్చాడు విజయ్. 

మొత్తం 234 సీట్లు ఉండగా విజయ్ టీవీకే పార్టీ 110 సీట్లకు పైగా స్థానాలను గెలుచుకుని.. తమిళనాడులో ప్రభుత్వం నెలకొల్పేందుకు సిద్ధమయ్యింది. ఈ క్రమంలో త్రిష పేరు ట్రెండ్ అవుతుంది. 

ఇదిలా ఉంటే తాజాగా దాదాపు 20 ఏళ్ల క్రితం త్రిష చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. 2004లో ఓ ఇంటర్వ్యూలో త్రిష మాట్లాడిన వీడియో ట్రెండింగ్ లోకి వచ్చింది.

గత కొన్ని నెలలుగా త్రిష , విజయ్ గురించి పలు రూమర్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అటు విజయ్ వ్యక్తిగత జీవితంలో సమస్యలు, భార్యతో విడాకుల ఇష్యూలో త్రిష పేరు కీలకంగా వినిపిస్తుంది. 

ఈరోజు ఉదయాన్నే తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది త్రిష. అనంతరం నేరుగా విజయ్ ఇంటికి చేరుకుని అతడికి అభినందనలు తెలపడంతో మరిన్ని రూమర్స్ తెరపైకి వచ్చాయి. 

త్వరలోనే త్రిష రాజకీయాల్లోకి అడుగుపెట్టనుందని.. టీవీకే ప్రభుత్వంలో ఆమెకు కీలక పదవి రానుందని టాక్ మొదలైంది. ముందు నుంచి ఆమె విజయ్ విజయంలో బ్యాగ్రౌండ్ వర్క్ చేస్తుందని టాక్.

ఇక ఇప్పుడు టీవీకే పార్టీ విజయం సాధించడంతో త్రిషకు సంబంధించిన పాత వీడియోస్, కామెంట్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ 20 ఏళ్ల కల అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.