చిరంజీవి విశ్వంభర సినిమా నుంచి కీరవాణి అవుట్.. 

Rajeev 

05 May  2026

instagram

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ ఫిల్మ్‌ ‘విశ్వంభర’. వశిష్ఠ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ రిలీజ్‌ పై ఇప్పటికీ సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది.

మొదట ఈ సినిమా 2025 సంక్రాంతికి రిలీజ్ అవుతుందంటూ మేకర్స్ హింట్ ఇచ్చారు. కానీ ఆ తర్వాత మూవీ వాయిదా పడింది. 

ఆపై టీజర్ గ్రాఫిక్స్ విషయంలో ఫ్యాన్స్‌ నుంచి నెటిజన్ల నుంచి విపరీతమైన ట్రోలింగ్ రావడంతో… ఈ మూవీపై రీవర్క్‌ మొదలెట్టారు వశిష్ట టీం.

దీంతో విశ్వంభర రిలీజ్ ఆగిపోయినట్టైంది. అయితే ఇంతలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ లైన్‌లోకి వచ్చేశాడు.

ఎట్ ప్రజెంట్ విశ్వంభర గ్రాఫిక్స్ వర్క్‌ పై రీవర్క్ చేస్తున్న వశిష్ట టీం ఈమూవీని ఎట్టిపరిస్థుతుల్లోనూ 2026 మధ్యలో రిలీజ్‌ చేసేందుకు ఫిక్స్ అయినట్టుగా ఇన్‌సైడ్ టాక్.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా నుంచి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తప్పుకున్నారని తెలుస్తుంది. ఆయన ప్లేస్ లో మరో మ్యూజిక్ డైరెక్టర్ జాయిన్ అవుతున్నారని తెలుస్తుంది. 

విశ్వంభర బాధ్యతలు గౌరహరికు అప్పగించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కీరవాణి మ్యూజిక్ అందించగా.. నేపథ్య సంగీతాన్ని గౌరహరికి అప్పగించింది చిత్రయూనిట్.