AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హీరోయిన్ పెళ్లి ఆపమని నిర్మాత నన్ను అడిగారు.. షాకింగ్ విషయం చూపిన షావుకారు జానకి

అగ్రతార సౌకార్ జానకి ఓ ఇంటర్వ్యూలో నటులు ఎన్టీఆర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఎవరి వ్యక్తిగత విషయాల్లోనూ తాను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని జానకి గారు వివరించారు. రామారావు గారి పట్ల తనకు ఎంతో గౌరవం ఉండేదని, ఆయన టాలెంట్‌ను, ఎదుగుదలను మాత్రమే తాను చూశానని తెలిపారు.

ఆ హీరోయిన్ పెళ్లి ఆపమని నిర్మాత నన్ను అడిగారు.. షాకింగ్ విషయం చూపిన షావుకారు జానకి
Sowcar Janaki
Rajeev Rayala
|

Updated on: May 05, 2026 | 1:58 PM

Share

అగ్రతార షావుకారు జానకి ఇటీవల సాక్షి టీవీ ఫ్లాష్‌బ్యాక్ ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత జీవితం, తోటి నటీనటులతో సంబంధాలపై కీలక విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా, ఎన్టీ రామారావు, కృష్ణకుమారి మధ్య వివాహం దాకా వెళ్ళిందని, తాను జోక్యం చేసుకుని ఎన్టీఆర్ గారిని నిలదీశానని వచ్చిన పుకార్లను ఆమె ఖండించారు. “ఎవరి వ్యక్తిగత విషయాల్లోనూ నేను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు” అని ఆమె స్పష్టం చేశారు. ఎన్టీఆర్ గారి పట్ల తనకు అమితమైన గౌరవం ఉండేదని, ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో ఆయన తనతో రెండుసార్లు కలిసి పనిచేశారని గుర్తుచేసుకున్నారు. ఆయన ప్రతిభను, ఉన్నత స్థాయిని మాత్రమే తాను చూశానని, “గురుభావం తప్ప, చిల్లర విషయాలెప్పుడూ గుర్తురాలేదు” అని జానకి గారు వివరించారు. కృష్ణకుమారి తన కెరీర్ ఉన్నత దశలో 17 సినిమాలను రద్దు చేసుకున్నారని, తన జీవితంలో ఏదో గాయం జరిగి ఉండవచ్చని షావుకారు జానకి అభిప్రాయపడ్డారు. కృష్ణకుమారి, అజయ్ ఖైతాన్ (ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రామ్‌నాథ్ గోయెంకా అల్లుడు) వివాహం చేసుకుంటున్నప్పుడు, ఒక ప్రముఖ నిర్మాత పెళ్లి ఆపమని తనను కోరగా, “ఇది వారి వ్యక్తిగత విషయమని, తాను జోక్యం చేసుకోబోనని” చెప్పినట్లు షావుకారు జానకి వెల్లడించారు.

ఇది కూడా చదవండి : Jagapathi Babu: ఆ సినిమా నుంచి చెప్పాపెట్టకుండా తీసేశారు.. చాలా బాధ అనిపించింది

పెళ్లి అనేది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం అని, అందులో ఇతరులు జోక్యం చేసుకోవడం తగదని తన దృఢమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కృష్ణకుమారి తన వ్యక్తిగత నిర్ణయాన్ని తీసుకుని, సినిమాలు వదిలేసి, బెంగళూరులో స్థిరపడిపోయారని ఆమె పేర్కొన్నారు. తన నట జీవితంలోని ఇష్టమైన పాటల గురించి అడిగినప్పుడు, “నా మొదటి చిత్రం షావుకారు లోని పలుకరాదటే చిలుకా పాట నాకు చాలా ఇష్టం” అని జానకి తెలిపారు. అది తాను మొదటిసారి లిప్ మూమెంట్ ఇచ్చి నటించిన పాట అని గుర్తుచేసుకున్నారు. మంచి మనసుల్లో “ఓహోహో పావురమా”, “మనసే అందాల బృందావనం”, “ఓ తాయారమ్మ బంగారయ్య” వంటి పాటలు కూడా తనకిష్టమైనవని చెప్పారు. సత్యనారాయణ గారితో కలిసి నటించిన “ఓ తాయారమ్మ బంగారయ్య” పాత్ర తనకెంతో నచ్చినదని అన్నారు.

ఇది కూడా చదవండి :వారికి కోరికలు చాలా తక్కువ..! అందుకే వాళ్లు అలా ఉన్నారు.. మనం ఇలా ఉన్నాం: పూరిజగన్నాథ్

పురస్కారాల గురించి మాట్లాడుతూ, పదిహేనవ తరగతి (మెట్రిక్యులేషన్) మాత్రమే చదివినప్పటికీ, అరిజోనా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందడం తనకెంతో గర్వకారణమని షావుకారు జానకి తెలిపారు. ఫిల్మ్‌ఫేర్, ఫిల్మ్ ఫ్యాన్స్, డైనోరా అండ్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్, శివాజీ గణేశన్ అవార్డ్ వంటి ఎన్నో పురస్కారాలు అందుకున్నానని పేర్కొన్నారు. ప్రతీ అవార్డు తనకు ప్రోత్సాహాన్ని ఇచ్చిందని, నట జీవితంలో కొనసాగడానికి ధైర్యాన్ని ఇచ్చిందని ఆమె వెల్లడించారు. తన కుమార్తె వైష్ణవి తనలా కాకుండా సినీ రంగంలోకి రాకుండా, ప్రేమ వివాహం చేసుకుని సంతోషంగా ఉందని తెలిపారు.

ఇది కూడా చదవండి :నా గుండు వెనక అసలు కథ ఇదే.. షాకింగ్ విషయం చెప్పిన కమెడియన్ సుదర్శన్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us