AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా గుండు వెనక అసలు కథ ఇదే.. షాకింగ్ విషయం చెప్పిన కమెడియన్ సుదర్శన్

గుండు సుదర్శన్.. ఈ నటుడు చాలా మంది తెలిసే ఉంటుంది. తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ మెప్పిస్తూ ఉంటారు సుదర్శన్. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు ఈయన. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

నా గుండు వెనక అసలు కథ ఇదే.. షాకింగ్ విషయం చెప్పిన కమెడియన్ సుదర్శన్
Gundu Sudarshan
Rajeev Rayala
|

Updated on: May 03, 2026 | 7:17 PM

Share

ప్రముఖ హాస్య నటుడు గుండు సుదర్శన్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో తన కామెడీతో నవ్వులు పూయించారు. ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి ఆకట్టుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుదర్శన్ ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. లెక్చరర్‌గా, కమెడియన్‌గా ఆయన ప్రస్థానం, హాస్యం పట్ల ఆయనకున్న అవగాహన, గోదావరి జిల్లాలతో ఆయనకున్న అనుబంధం గురించి వివరించారు. సుదర్శన్ మాట్లాడుతూ..  నవ్వడం అనేది తన వీక్‌నెస్సా, స్ట్రెంగ్త్ అనేది తెలియదని, అయితే నవ్వు అనేది ఒక ఆత్మను వెలిగించే గొప్ప సాధనమని గుండు సుదర్శన్ పేర్కొన్నారు. చిరునవ్వు ఏ వ్యక్తిలోనైనా ఇగోను తగ్గించి, సరళమైన వ్యక్తిత్వాన్ని సూచిస్తుందని, సానుకూల సంకేతాన్ని పంపుతుందని ఆయన తెలిపారు. చిరునవ్వు, మృదువైన నవ్వు, గట్టి నవ్వు వంటి అనేక రకాలు సందర్భాన్ని బట్టి ఉంటాయని, అయితే చిన్న చిరునవ్వు ఆహ్వానం లాంటిదని అన్నారు. ఇంట్లో కూడా తాను సరదాగానే ఉంటానని, కుటుంబం ఆనందానికి ముఖ్య ప్రాతిపదిక అని తెలిపారు సుదర్శన్.

ఇది కూడా చదవండి : ఆ హీరో పిలిచి తిడతాడనుకున్నా.. కానీ ఆయన చేసిన పనికి షాక్ అయ్యా

గోదావరి జిల్లాల సంస్కృతి, ముఖ్యంగా భీమవరం నేపథ్యం ఆయన హాస్యానికి మూలమని గుండు సుదర్శన్ వెల్లడించారు. భీమవరం ఎటకారానికి పెట్టింది పేరని, అక్కడి నీళ్లలోనే ఎటకారం ఉందని సరదాగా చెప్పారు. పెద్ద చదువులు లేని చిన్న రిక్షా డ్రైవర్ కూడా తన మాటల్లో ఎటకారాన్ని ప్రదర్శిస్తాడని ఉదాహరించారు. లెక్చరర్‌గా ఉన్నప్పుడు కూడా ఆయన బోధనలో హాస్యం అంతర్భాగంగా ఉండేది. విద్యార్థులకు బోర్ కొట్టకుండా, తరగతులకు ఆసక్తిని కలిగించడానికి తాను జోక్స్ చెప్పేవాడిని, కామెడీ చేసేవాడిని, దీని వల్ల విద్యార్థులు స్వచ్ఛందంగా తన క్లాసులకు హాజరయ్యేవారని అన్నారు.

ఇది కూడా చదవండి : Talluri Rameswari: నా రెమ్యునరేషన్ గురించి ఆ స్టార్ హీరో అలా అనేసరికి షాక్ అయ్యా..!

గుండు అనే పేరు తనకు ఎలా వచ్చిందో కూడా సుదర్శన్ పంచుకున్నారు. ఒకప్పుడు గిరజాల జుట్టు ఉన్నప్పటికీ, చిత్రమ్ వంటి తన తొలి చిత్రాలలో గుండుతోనే కనిపించానని, ఆ లుక్‌ను దర్శకులు మెచ్చుకున్నారని తెలిపారు. జుట్టు లేకపోవడం వల్ల ఎటువంటి మెయింటెనెన్స్ అవసరం లేదని, హాయిగా ఉంటుందని సరదాగా వ్యాఖ్యానించారు. జుట్టును జాగ్రత్తగా చూసుకోవడం, దువ్వడం వంటి బాధలు గుండుకు ఉండవని, దీనిని తాను పొనకాయ లాగా స్వీకరించానని చెప్పారు. గుండుతో చాలామంది ఉన్నప్పటికీ, గుండు సుదర్శన్ అనే పేరు తనకే వచ్చిందని పేర్కొన్నారు. నటన వృత్తితో పాటు, ఆయన ఇతర సామాజిక కార్యక్రమాలలో కూడా చురుకుగా పాల్గొంటారు. సైకాలజీ పరంగా మోటివేషనల్ స్పీకర్, ఇన్స్పిరేషనల్ వక్తాగా కూడా తన సేవలను అందిస్తున్నారు సుదర్శన్.

ఇది కూడా చదవండి : ఎక్స్ క్లూజివ్ కంటెంట్ ఇస్తా.. ఇన్ స్టా సబ్‌స్క్రిప్షన్ మొదలు పెట్టిన రామ్ చరణ్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us