Kalaignar ఊహించి ఉంటారా..? తన వెనుక ఉన్న ఈ కుర్రాడు DMKని కుప్ప కూల్చుతాడు అని
ఒక పాత ఫోటో… ఒక షార్ప్ కామెంట్… ఇప్పుడు రాజకీయాల్లో కొత్త చర్చ. Kalaignar వెనుక నిలబడ్డ ఆ చిన్న కుర్రాడు ఎవరు? నిజంగా అతనే భవిష్యత్తులో DMK పార్టీకి షాక్ ఇచ్చాడా? అంటూ సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ మొదలైంది. ..

అది మొన్నటివరకు ఓ సాధారణ సెలబ్రిటీ ఫోటో. కానీ ఇప్పుడో సంచనలం.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఫోటో కాలం ఎలాంటి మార్పులు తీసుకువస్తుందో అద్దం పడుతుంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ షేర్ చేసిన ఈ అరుదైన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఫోటోలో కనిపిస్తున్నది తమిళ రాజకీయాల్లో ఒక లెజెండ్ కరుణానిధి. ఆయన చుట్టూ అభిమానులు, నేతలు, ఆ కాలం ఉత్సాహం అన్నీ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తున్నాయి. కానీ ఈ ఫోటోలో మీరు గమనించాల్సింది. ఆయన వెనుక నిలబడి ఉన్న ఒక చిన్న కుర్రాడు.
“Kalaignar ఊహించకపోయి ఉండొచ్చు.. తన వెనుక ఉన్న ఈ కుర్రాడు ఒక రోజు ఆయన పార్టీని కుదిపేస్తాడని” అంటూ వర్మ చేసిన కామెంట్ చర్చలకు దారి తీసింది. ఇప్పటికే ఆ కుర్రాడు ఎవరో చాలామంది కనిపెట్టి ఉంటారు. మరెవరో కాదు టీవీకే అధినేత, కాబేయే సీఎం, ఇటీవల తమిళనాడు ఎన్నికల్లో సంచలన విజయం నమోదు చేసిన విజయ్. ఇలాంటి ఫోటోలు కేవలం జ్ఞాపకాలు కావు. అవి కాలాన్ని దాటి వస్తూ.. ఓ కొత్త అధ్యాయానికి సాక్ష్యంగా నిలుస్తాయి. Kalaignar వంటి దిగ్గజం చుట్టూ పెరిగిన తరాలు.. తరువాత కాలంలో ఆయనే పార్టీనే దెబ్బ కొట్టడం భారత రాజకీయాల్లో చాలా అరుదు. ఈ ఫోటో ఆ మార్పును ఒక విజువల్‌గా చూపించడం వల్లే ఇది వైరల్ అయింది. రామ్ గోపాల్ వర్మకు ఇలాంటి ట్వీట్లు కొత్త కాదు. లాజిక్‌తో కొట్టడంలో ఆయన స్టైలే వేరు. సెటైర్ల విషయంలో కూడా తన మార్క్ చూపిస్తుంటారు. తాజాగా ఈ పోస్ట్‌తో మరోసారి తన క్రియేటివిటీ చూపారు.
Kalaingar wouldn’t have dreamed that the kid behind him would one day destroy his party 🙏👍🔥 pic.twitter.com/7NNp6Ge73S
— Ram Gopal Varma (@RGVzoomin) May 5, 2026
