AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nandamuri Balakrishna: బ్రహ్మంగారు చెప్పిందే నిజమైంది.. విజయ్ గెలుపుపై బాలయ్య..

Nandamuri Balakrishna on Thalapathy Vijay: తమిళరాజకీయాల్లో సంచలనం సృష్టించిన టీవీకే పార్టీ అధ్యక్షుడు దళపతి విజయ్‌కు టీడీపీ ఎమ్మెల్యే సినీ హీరో నందమూరి బాలకృష్ణ అభినందనలు తెలిపారు. ఎంజీఆర్, ఎన్టీఆర్ తర్వాత పార్టీ పెట్టిన అనతి కాలంలోనే అత్యధిక మెజార్టీ సీట్లు సొంతం చేసుకొని సీఎం బాధ్యతలు చేపట్టబోతున్నందుకు గర్వంగా ఉందన్నారు. వీర భ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పినట్టుగానే సినీ రాజకీయ చరిత్రలో మరో ఒక అద్భుతం పునరావృతమైందన్నారు.

Nandamuri Balakrishna: బ్రహ్మంగారు చెప్పిందే నిజమైంది.. విజయ్ గెలుపుపై బాలయ్య..
Nandamuri Balakrishna On Thalapathy Vijay
Anand T
|

Updated on: May 05, 2026 | 2:46 PM

Share

తమిళరాజకీయాల్లో సంచలనం సృష్టించిన టీవీకే పార్టీ అధ్యక్షుడు దళపతి విజయ్‌కు టీడీపీ ఎమ్మెల్యే సినీ హీరో నందమూరి బాలకృష్ణ అభినందనలు తెలిపారు.ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. వీర భ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగానే ప్రపంచ సినీ రాజకీయ చరిత్రలో మరో ఒక అద్భుతమైన పునరావృతమని ఆయన అన్నారు. వెండితెర నుండి జనం గుండెల్లోకి ప్రవేశించి, అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా ఎదిగిన రోనాల్డ్ రీగన్ గారు ఒక చరిత్ర అయితే. దక్షిణ భారత రాజకీయ చరిత్రలో చెరగని ముద్ర వేసిన భారతరత్న ఎమ్.జి.ఆర్ గారు, పురట్చి తలైవి జయలలిత గారు మరో అద్భుతమన్నారు.

అప్పుడు యుగపురుషుడు ఎన్టీఆర్

అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ, తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి, కేవలం 9 నెలల్లోనే ప్రభంజనం సృష్టించి అధికారాన్ని చేపట్టి పెదపాలిట పెన్నిధిగా, రైతన్నలకు అన్నదాతగా, కార్మికసోదరలకు దన్నుగా, ఆడపడుచులకు అన్నగా నిలబడిన మన అన్నగారు, నాన్న నందమూరి తారక రామారావు ఒక యుగపురుషుడన్నారు.

ఇప్పుడు దళపతి విజయ్

అదే స్ఫూర్తితో ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ స్థాపించి కేవలం 27 నెలల కాలంలోనే అఖండ విజయాన్ని అందుకుని, పీఠాన్ని అధిరోహించబోతున్న సినీ రాజకీయ ధురంధరుడు దళపతి విజయ్‌కు నా హృదయపూర్వక అభినందనలు, శుభాభినందనలు అని రాసుకొచ్చారు. చరిత్రను తిరగరాస్తూ విజయ్ సాధించిన ఈ విజయం అద్వితీయమని.. అతను మరిన్ని విజయ శిఖరాలను అధిరోహించాలని, ప్రజా సేవలో సుదీర్ఘకాలం వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నానన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us