AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చికెన్, మటన్‌ను మించి.. రోజూ పల్లీలు తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?

చాలామంది పల్లీలను కేవలం కాలక్షేపం కోసం తినే చిరుతిండిగా భావిస్తారు. కానీ ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పల్లీలు పోషకాల గని. వీటిని పేదల జీడిపప్పు అని పిలిచినప్పటికీ, వీటిలో ఉండే పోషక విలువలు అత్యంత ఖరీదైన డ్రై ఫ్రూట్స్ కంటే తక్కువ ఏమీ కావు. ముఖ్యంగా పచ్చి వేరుశెనగల కంటే వేయించిన వేరుశెనగలలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయని అధ్యయనాలు వెల్లడించాయి. ప్రతిరోజూ ఒక గుప్పెడు వేయించిన వేరుశెనగలను తీసుకోవడం వల్ల మన శరీరంలో కలిగే విప్లవాత్మక మార్పులు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Krishna S
|

Updated on: May 05, 2026 | 11:43 AM

Share
చికెన్, మటన్‌కు దీటైన ప్రోటీన్ శక్తి: సాధారణంగా ప్రోటీన్ కోసం చాలామంది మాంసాహారంపై ఆధారపడుతుంటారు. అయితే 100 గ్రాముల వేయించిన వేరుశెనగలలో దాదాపు 25 నుండి 28 గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటుంది. ఇది దాదాపు కోడి మాంసంలో ఉండే ప్రోటీన్ స్థాయికి సమానం. శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు, జిమ్ వెళ్లేవారు, కండరాలు బలంగా ఉండాలనుకునే వారికి ఇది ఒక సహజ సిద్ధమైన ప్రోటీన్ సప్లిమెంట్.

1 / 5
గుండె ఆరోగ్యంపై అద్భుత ప్రభావం: వేరుశెనగలలో మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు 49 గ్రాముల వరకు ఉంటాయి. ఇవి రక్తంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి, మంచి కొలెస్ట్రాల్ శాతాన్ని పెంచుతాయి. దీనివల్ల గుండె ధమనులలో అడ్డంకులు ఏర్పడవు, ఫలితంగా గుండె జబ్బుల ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది.

2 / 5
జ్ఞాపకశక్తి పెరగడం: వయసు పెరిగే కొద్దీ చాలామందిలో జ్ఞాపకశక్తి తగ్గుతుంటుంది. వేరుశెనగలలో పుష్కలంగా ఉండే నియాసిన్ మెదడు కణాల పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది అల్జీమర్స్ వంటి మెదడు సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా చదువుకునే పిల్లలకు, వృద్ధులకు ఇది ఎంతో మేలు చేస్తుంది.

3 / 5
బరువు తగ్గాలనుకునే వారికి వరప్రసాదం: బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి వేరుశెనగలు గొప్ప ఆహారం. వీటిలో ఉండే అధిక పీచుపదార్థం, ప్రోటీన్ కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి. ఫలితంగా జంక్ ఫుడ్ లేదా ఇతర చిరుతిళ్లు తినాలనే కోరిక తగ్గుతుంది. ఇది అతిగా తినడాన్ని అరికట్టి బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.

4 / 5
వ్యాధి నిరోధక శక్తి - చర్మ సౌందర్యం: ఇందులో మెగ్నీషియం, విటమిన్ ఇ, ఫోలేట్, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా చర్మం యవ్వనంగా ఉండటానికి, జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడతాయి.

5 / 5
Follow Us
మంగళవారం నాడు పొరపాటున కూడా ఆ పనులు చేయకండి, క్ష్మీదేవికి ఆగ్రహం!

మీ పాత ఫోన్‌ను పైసా ఖర్చు లేకుండా సీసీటీవీగా మార్చేయండి..

వంకాయ, ఎండు చేప, కోడి గుడ్లకూర.. ఊరించే పల్లెటూరి రుచి!

ఫ్రాన్స్‌లో ప్రధాని మోదీ, ట్రంప్ భేటీ
ఫ్రాన్స్‌లో ప్రధాని మోదీ, ట్రంప్ భేటీ
ఫ్రిజ్ పైన పొరపాటున కూడా ఈ వస్తువులను ఉంచకండి.. నెగటివ్ ఎనర్జీకి

వడ్డే నవీన్ మొదటి భార్య ఆ టాలీవుడ్ స్టార్ హీరో సోదరి అని తెలుసా?

ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. సప్లిమెంటరీ రిజల్ట్ ఇలా చెక్..

స్మృతి, షఫాలీ ఊచకోత.. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా భారీ రికార్డ్

సైబర్ నేరగాళ్ల టార్గెట్‌గా డాక్టర్లు.. రూ.29.8 కోట్లు దోపిడీ!

తిరుపతిలో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం