వర్షాకాలంలో అస్సలే తినకూడని ఒకే ఒక పండు ఇదే.. తెలుసుకోవాలా?
Samatha
31 July 2026
పండ్లు తినడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా ప్రతిరోజూ తమకు నచ్చిన ఏదో ఒక రకం పండు తినడానికి ఆసక్తి చూపుతుంటారు.
ఇక కొంత మంది సీజన్ ప్రకారం, ఏ సీజన్‌లో దొరికే పండును ,ఆ సీజన్‌లో తింటుంటారు. తమకు నచ్చినవి తింటారు.
అయితే పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, వర్షాకాలంలో మాత్రం అస్సలే ఒక పండు తినకూడదంటున్నారు నిపుణులు.
కాగా, ఇప్పుడు మనం వర్షాకాలంలో తినకూడని పండు ఏదో వివరంగా తెలుసుకుందాం. వర్షాకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తుంటాయి.
అంతే కాకుండా ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువలన ఇటువంటి సమయంలో తప్పకుండా కొన్ని రకాల పండ్లకు దూరంగా ఉండాలని చెబుతారు ఆరోగ్య నిపుణులు.
ముఖ్యంగా వర్షాకాలంలో పొరపాటున కూడా పుచ్చకాయ తినకూడదంట. ఇది ఈ సీజన్‌లో తినడం చాలా ప్రమాదకరం అంటున్నారు నిపుణులు.
పుచ్చకాయలో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన ఈ సమయంలో దీనిని తినడం వలన కడుపు సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయంట.
అంతే కాకుండా వర్షాకాలంలో పుచ్చకాయ తినడం వలన గ్యాస్, ఎసిడిటీ, వంటి సమస్యలు అధికం అవుతాయి. కడుపు నొప్పి లాంటి ఇబ్బందులు కూడా తలెత్తుతాయంట.