మీకు తెలుసా? పదే పదే దాహం వేయడం కూడా ఒక ప్రమాదమేనంట

Samatha

31 July 2026

దాహం వేయడం అనేది సహజం. కొంత మందికి పదే పదే దాహం వేస్తుంటుంది. అయితే దీనిని చాలా మంది లైట్ తీసుకుంటారు. కానీ ఇలా పదే పదే దాహం వేయడం మంచిది కాదంట.

పదే పదే దాహం వేయడం కూడా ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కాగా, ఇప్పుడు మనం దాని గురించి వివరంగా తెలుసుకుందాం.

పదే పదే దాహం వేస్తే అస్సలే అశ్రద్ధ చేయకుండా వైద్యుడిని సంప్రదించాలంట. ఎందుకంటే? ఇది కొన్ని రకాల అనారోగ్య సమస్యలకు కారణం అయ్యే ఛాన్స్ ఉన్నదంట.

ముఖ్యంగా మధుమేహం ఉన్నవారిలో , రక్తంలో చక్కెర శాతం పెరగడం వలన ఇది మూత్రపిండాలను సులభంగా ఫిల్టర్ చేయ, నీటి కొరత ఏర్పడుతుంది. దీని వలన పదే పదే దాహం వేస్తుందంట.

అలాగే అజీర్ణం వంటి సమస్యలు ఉన్నవారికి కూడా పదే పదే దాహం వేస్తుంది. అస్సలే దీనిని లైట్ తీసుకోకూడదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

అంతే కాకుండా కొంత మందిలో మానసిక పరిస్థితి కూడా బాగుండదు, భయాందోళన, అశాంతి వంటి సమస్యలు ఎదుర్కుంటారు.

అయితే అలాంటి వారికి కూడా పదే పదే దాహం వేస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దీని వలన నోరు ఎక్కువగా ఎండిపోతుందంట.

చెమటలు పట్టడం చాలా కామన్. కానీ కొంత మందిలో సీజన్‌తో పని లేకుండా పదే పదే చెమటలు పడుతుంటాయి. అయితే అలాంటి వారికి కూడా అధికంగా దాహం వేస్తుందంట.