PCODని తరిమికొట్టే అద్భుతమైన డ్రింక్.. కప్పు తాగితే బోలెడు లాభాలు

Samatha

30 July 2026

ఈ మధ్య కాలంలో చాలా మంది PCOD సమస్యతో బాధపడుతున్నారు. చిన్న వయసులోనే దీని భారినపడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అయితే ఈ పీసీఓడీ సమస్యతో బాధపడే వారు దాని నుంచి బయటపడటానికి ఈ ఒక్క డ్రింక్ తాగితే చాలు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఇంతకీ ఆ డ్రింక్ ఏది అనుకుంటున్నారా. దాల్చిన చెక్క మెంతుల టీ. ఇది ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. శరీరానికి చాలా మంచిది.

చాలా మంది మహిళలు అండాశయాలలో తిత్తులు, శరీరంలో హార్మోన్ల అసమతుల్యతతో మానసిక, శారీరక సమస్యలు ఎదుర్కుంటారు. ఇది మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

ముఖ్యంగా  ఇన్సులిన్, ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ వంటి మూడు హార్మోన్లు అసమతుల్యంగా మారుతాయి. దీనివలన పీసీఓడీ అటాక్ అవుతుంది. ఇది అనేక సమస్యలకు కారణం అవుతుంది.

అయితే ఇలా పీసీఓడీ సమస్యలు ఎదుర్కునే మహిళలు,  మెంతులు, దాల్చిన చెక్కతో తయారు చేసిన టీ ప్రతి రోజూ క్రమం తప్పకుండా తీసుకోవాలంట.

ఇది ఇన్సులిన్ బ్యాలెన్స్ చేయడమే కాకుండా నెలసరి సరిగ్గా వచ్చేందుకు సహాయపడుతుంది. అలాగే హార్మోన్ల పనితీరును మెరుగు పరుస్తుంది.

అంతే కాకుండా జీర్ణక్రియ ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి రోజూ ఒక కప్పు ఈ డ్రింక్ తాగడం వలన ఇది కడుపు నొప్పి, మలబద్ధకం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగేలా చేస్తుంది.