AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : ముంబై టీమ్‎కి నేనే దిక్కు.. ఐసీసీ కూడా నన్నే పిలుస్తుంది.. వీడి కాన్ఫడెన్స్ మామూలుగా లేదు

Viral Video : యూట్యూబ్ స్టార్ ఐషో స్పీడ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. వెస్టిండీస్ పర్యటనలో క్రికెట్ ఆడుతూ, విరాట్ కోహ్లీకి కాల్ చేయమంటూ పంపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో 2023 వరల్డ్ కప్ సమయంలో కూడా ఇండియా వచ్చి టీమిండియా జెర్సీ వేసుకుని కోహ్లీని కలవడానికి నానా హంగామా చేసిన సంగతి తెలిసిందే.

Viral Video : ముంబై టీమ్‎కి నేనే దిక్కు.. ఐసీసీ కూడా నన్నే పిలుస్తుంది.. వీడి కాన్ఫడెన్స్ మామూలుగా లేదు
Virat Kohli
Rakesh
|

Updated on: May 05, 2026 | 11:25 AM

Share

Viral Video : యూట్యూబ్ సెన్సేషన్, అమెరికన్ స్ట్రీమర్ ఐషో స్పీడ్ గురించి తెలియని సోషల్ మీడియా యూజర్ ఉండరు. తన వింత చేష్టలతో, స్పోర్ట్స్ స్టార్లపై తనకున్న అభిమానంతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే స్పీడ్.. తాజాగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి పంపిన మెసేజ్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. వెస్టిండీస్ పర్యటనలో ఉన్న స్పీడ్, అక్కడ చేసిన హంగామా మామూలుగా లేదు. ప్రస్తుతం కరీబియన్ దీవుల్లో పర్యటిస్తున్న ఐషో స్పీడ్, అంటిగ్వాలోని ప్రసిద్ధ సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియానికి చేరుకున్నాడు. అక్కడ వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ అల్జారీ జోసెఫ్‌తో కలిసి క్రికెట్ ఆడాడు. అల్జారీ జోసెఫ్ బౌలింగ్ చేస్తుంటే నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో నిలబడి పర్యవేక్షించిన స్పీడ్, ఆ తర్వాత తానే బంతిని పట్టుకుని విసిరాడు. క్రికెట్ రూల్స్ ప్రకారం అది ఇల్లీగల్ యాక్షన్ అయినప్పటికీ, వికెట్లను పడగొట్టగానే తన స్టైల్లో గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకున్నాడు.

వికెట్ పడగానే స్పీడ్ కెమెరా వైపు తిరిగి “నేను గ్రేటెస్ట్ ప్లేయర్ని కాబోతున్నాను. విరాట్ కోహ్లీ.. నాకు కాల్ చెయ్ బ్రో.. నీకు నా అవసరం ఉంది” అంటూ కేకలు వేశాడు. అంతటితో ఆగకుండా ఐసీసీకి, ముంబై క్రికెట్ టీమ్ (ముంబై ఇండియన్స్)కి కూడా తనను పిలవాలంటూ మెసేజ్‎లు పంపాడు. స్పీడ్‌కు విరాట్ కోహ్లీ అంటే ప్రాణం. గతంలో 2023 వరల్డ్ కప్ సమయంలో కూడా ఇండియా వచ్చి టీమిండియా జెర్సీ వేసుకుని కోహ్లీని కలవడానికి నానా హంగామా చేసిన సంగతి తెలిసిందే.

క్రికెట్ ఆడుతున్న సమయంలో తన స్నేహితుడు ఒకరు తప్పుడు షాట్ ఆడితే.. అది బాబర్ అజామ్ ఆడే షాట్ లా ఉందంటూ సెటైర్లు వేశాడు. ఆ వెంటనే తాను ఒక మంచి షాట్ ఆడి ఇది విరాట్ కోహ్లీ స్టైల్ బేబీ అంటూ తన అభిమానాన్ని చాటుకున్నాడు. గత ఏడాది కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు తప్పుడు వార్తలు వచ్చినప్పుడు (నిజానికి కోహ్లీ టెస్టుల నుంచి 2022లో తప్పుకున్నాడు, స్పీడ్ ఈ మధ్య దానిపై రియాక్ట్ అయ్యాడు).. లెజెండ్స్ అందరూ ఇలా రిటైర్ అయిపోతే ఎలా? 36 ఏళ్లకే రిటైర్మెంట్ ఏంటి? అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఐషో స్పీడ్ ఒక ప్రముఖ అమెరికన్ యూట్యూబర్. ఆయనకు దాదాపు 5.5 కోట్ల (55 మిలియన్) మంది ఫాలోవర్లు ఉన్నారు. ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు అతిపెద్ద అభిమాని అయిన స్పీడ్, గత కొంతకాలంగా క్రికెట్, విరాట్ కోహ్లీపై కూడా విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నాడు. ఆయన ఎక్కడకు వెళ్లినా వేల సంఖ్యలో జనం తరలివస్తుంటారు. తాజాగా అంటిగ్వాలో ఆయన చేసిన సందడి ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us