ANGRAU Admissions 2026: ఎన్‌జీ రంగా వ్యవసాయ వర్సిటీలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచే దరఖాస్తులు ప్రారంభం
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాలిటెక్నిక్, అనుంబంధ పాలిటెక్నిక్ కాలేజీలలో వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన వెలువరించింది. పదో తరగతిలో ఉత్తీర్ణత పొందిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు..

అమరావతి, మే 5: గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాలిటెక్నిక్, అనుంబంధ పాలిటెక్నిక్ కాలేజీలలో వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన వెలువరించింది. పదో తరగతిలో ఉత్తీర్ణత పొందిన వారు ఎవరైనా ఆన్‌లైన్‌లో మంగళవారం (మే 5) నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండానే పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. అయతే విద్యార్ధుల వయోపరిమితి తప్పనిసరిగా 15 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన విద్యార్ధులు మే 21, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి సాధించిన మార్కులు ఆధారంగా ఆయా రిజర్వేషన్ వర్గాలకు నిబంధనల మేరకు సీట్లు కేటాయిస్తారు. ప్రవేశాలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ త్వరలోనే అధికారిక వెబ్‌సట్‌లో అందుబాటులో ఉంచుతారు.
ఎన్‌జీ రంగా వర్సిటీ ANGRAU డిప్లొమా అడ్మిషన్ల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ముఖ్యమైన తేదీలు ఇవే..
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: మే 5, 2026.
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: మే 21, 2026.
- తరగతులు ప్రారంభ తేదీ: త్వరలోనే వెల్లడి
ఎన్‌జీ రంగా వర్సిటీ ANGRAU డిప్లొమా అడ్మిషన్ల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




