AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG Inter Supply 2026 Exams: మరో వారంలోనే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు.. పూర్తి టైం టేబుల్‌ ఇదే

TG Intermediate Advanced supplementary time table 2026: ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులకు మే నెలలోనే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల..

TG Inter Supply 2026 Exams: మరో వారంలోనే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు.. పూర్తి టైం టేబుల్‌ ఇదే
Telangana Inter Supplementary Time Table
Srilakshmi C
|

Updated on: May 04, 2026 | 6:23 PM

Share

హైదరాబాద్‌, మే 4: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులకు మే నెలలోనే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 13 నుంచి మే 21 వరకు ప్రతిరోజూ రెండు సెషన్లలో జరగనున్నాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరగనున్నాయి. థియరీ పరీక్షలు ముగిసిన వెంటనే ప్రాక్టికల్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రాక్టికల్ పరీక్షలు మే 22 నుంచి 25 వరకు జరుగుతాయి. ఇవి కూడా ఆయ తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో జరుగుతాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి.

మే 26వ తేదీన ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్ష, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష నిర్వహిస్తారు. మే 28న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష ఉంటుంది. విద్యార్థులు తమ పరీక్షల సమయాన్ని, తేదీలను గమనించి సన్నద్ధం కావాలని ఈ సందర్భంగా ఇంటర్‌ బోర్డు సూచించింది. కాగా ఇంటర్ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ ఫెయిలైన విద్యార్థులతోపాటు ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాసే విద్యార్ధులు కూడా ఈ పరీక్షలు రాయవచ్చు. పూర్తి టైం టేబుల్ ఈ కింద చెక్‌ చేసుకోండి.

ఇవి కూడా చదవండి

తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ 2026 టైం టేబుల్ ఇదే

  • మే 13న సెకండ్ లాంగ్వేజ్
  • మే 14న ఇంగ్లిష్‌
  • మే 15న మ్యాథ్స్ ఏ, బోట‌నీ , పొలిటిక‌ల్ సైన్స్
  • మే 16న మ్యాథ్స్ 2ఏ, జువాల‌జీ, హిస్టరీ
  • మే 18న ఫిజిక్స్, ఎకనామిక్స్
  • మే 19న కెమిస్ట్రీ, కామ‌ర్స్
  • మే 20న ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్ , బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్
  • మే 21న మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us