AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG 10th 2026 Results: ఈ తేదీల్లోనే పదో తరగతి ఫలితాలు విడుదల.. మరో 2 రోజుల్లో ముగియనున్న మూల్యాంకనం

పదో తరగతి ఫలితాల 2026 విడుదలకు విద్యాశాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. మార్చి 14వ తేదీ నుంచి ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు నెల రోజలపాటు కొనసాగి ఏప్రిల్ 16తో ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,28,239 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచే జవాబు పత్రాల మూల్యాంకనం..

TG 10th 2026 Results: ఈ తేదీల్లోనే పదో తరగతి ఫలితాలు విడుదల.. మరో 2 రోజుల్లో ముగియనున్న మూల్యాంకనం
Telangana SSC 10th class Results
Srilakshmi C
|

Updated on: Apr 23, 2026 | 2:06 PM

Share

హైదరాబాద్‌, ఏప్రిల్ 23: తెలంగాణ పదో తరగతి ఫలితాల 2026 విడుదలకు విద్యాశాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. మార్చి 14వ తేదీ నుంచి ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు నెల రోజలపాటు కొనసాగి ఏప్రిల్ 16తో ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,28,239 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచే జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ప్రారంభమైంది. ఏప్రిల్‌ 25వ తేదీతో మూల్యాంకనం ప్రక్రియ ముగియనుంది. ఇప్పటికే తెలుగు, హిందీ, ఇంగ్లిష్, గణితం సబ్జెక్టుల జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయింది. మిగిలిన సైన్స్, సోషల్ సబ్జెక్టుల మూల్యాంకనం ఏప్రిల్‌ 25వ తేదీతో ముగియనుంది.

అలాగే స్కానింగ్ ప్రక్రియ కూడా ఏప్రిల్‌ 25వ తేదీలోపు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే మార్కుల క్రోడీకరణ (ట్యాబ్యులేషన్) కూడా ఎటువంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా మరో 10 రోజుల్లో పూర్తి చేయనుంది. ఇక మే 4 లేదా 5వ తేదీల్లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను ప్రకటించాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. సాధ్యమైతే ఇంకాస్త త్వరగానే ఫలితాలను వెల్లడించాలని విద్యాశాఖ పనులు వేగవంతం చేసింది. మొత్తంగా మే మొదటి వారంలోనే ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.

మరోవైపు ఏపీలోనూ మే మొదటి వారంలోనే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు వెల్లడించేందుకు విద్యాశాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తుంది. ఈ ఏడాది మొత్తం 6,40,916 మంది విద్యార్థులు అంటే సుమారు 99.5 శాతం మంది పరీక్షలు రాశారు. కాగా ఈసారి పదో తరగతి విద్యార్ధులకు 6 మార్కులు అదనంగా అందరు విద్యార్ధులకు కలవనున్నాయి. హిందీలో 2 మార్కులు, ఇంగ్లిష్‌లో 4 మార్కులు చొప్పున కలవనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది. ప్రశ్నాపత్రంలో ఇచ్చిన తప్పిదాల కారణంగా విద్యార్ధులకు అదనంగా పరీక్షలు కలపాలని విద్యాశాఖ భావిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.

Follow Us