School Summer Holidays 2026: బడి పిల్లలకు భలే న్యూస్.. వేసవి సెలవులు వచ్చేశాయ్..!
ప్రభుత్వ, ప్రైవేట్ బడులకు రేపట్నుంచి (శుక్రవారం) వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. రెండు రాష్ట్రాల్లోని బడులకు బడులకు నేడే చివరి పనిదినం కానుంది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు తెలంగాణ, ఏపీలోని పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వనున్నట్లు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి..

అమరావతి, ఏప్రిల్ 23: తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ బడులకు రేపట్నుంచి (శుక్రవారం) వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. రెండు రాష్ట్రాల్లోని బడులకు బడులకు నేడే చివరి పనిదినం కానుంది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు తెలంగాణ, ఏపీలోని పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వనున్నట్లు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. తిరిగి జూన్ 12న పాఠశాలలు తెరుచుకోనున్నాయి. అదే రోజు నుంచి 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది.
ఏపీలో వేసవి సెలవుల సమయంలో టీచర్ల బదిలీలు జరుగుతాయి. అనంతరం టీచర్లకు మారిన సిలబ్‌సపై జూన్ మొదటి వారంలో శిక్షణ అందిస్తారు. అకడమిక్ కేలండర్ ప్రకారం ఈ ఏడాది వేసవి సెలవులను ప్రకటించింది. ఈ క్రమంలో విద్యార్థుల భద్రతపై విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. వేసవి సెలవుల్లో ఎండ తీవ్రత, చెరువులు, కాలువల వద్ద జరిగే ప్రమాదాల నివారణకు జిల్లా విద్యాధికారులకు పలు సూచనలు జారీ చేసింది. సెలవుల్లో కాలువలు, చెరువుల దగ్గరకు వెళ్లకుండా విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలని, ఎండల తీవ్రత దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. విద్యా సంవత్సరం చివరి రోజులోపు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు భద్రతా చర్యలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించింది.
సెలవుల్లో విద్యార్ధులు కాలువలు, చెరువులు, నదులు, బావుల వద్దకు వెళ్లకూడదని, పెద్దల పర్యవేక్షణలోనే ఈతకు వెళ్లాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా విద్యార్ధులు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో బయట తిరగకూడదని వివరించారు. ఈ మేరకు పాఠశాల నోటీసు బోర్డులపై భద్రతా నియమాలను ప్రదర్శించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అలాగే తల్లిదండ్రులకు సైతం ఈ సూచనలు చెప్పి.. సెలవుల్లో పిల్లలపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చూడాలని తెలిపారు. సెలవుల అనంతరం విద్యార్ధులను జూన్ 12న పాఠశాలలకు పంపించాలని, ఈ మేరకు సెలవు టూర్లను ప్లాన్ చేసుకోవాలని వివరించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




