వర్షాకాలంలో దోమల బెడద పెరిగింది.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
03 August 2026
Rajashekher
వర్షపు నీరు కుండలు, కూలర్లు, టైర్లు, బకెట్లు వంటి ప్రదేశాల్లో నిల్వ ఉండటం వల్ల దోమలు వేగంగా వృద్ధి చెందుతాయి. దీంతో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.
వర్షాకాలంలో దోమల బెడద..
దోమల ద్వారా డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా, జికా వైరస్, వెస్ట్ నైల్ వైరస్ వంటి తీవ్రమైన వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది.
దోమకాటు వల్ల వచ్చే ప్రమాదకర..
బయటకు వెళ్లేటప్పుడు పొడవాటి చేతులున్న దుస్తులు ధరించడం ద్వారా చర్మం బహిర్గతం కాకుండా చూసుకోవాలి. అవసరమైతే దోమల నివారణ లోషన్ లేదా స్ప్రే ఉపయోగించాలి.
ఇంటి చుట్టూ ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా తరచూ శుభ్రం చేయాలి. ఇది దోమల పెరుగుదలను అరికట్టే అత్యంత ప్రభావవంతమైన మార్గం.
నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి
అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కీళ్ల నొప్పులు, కళ్ల వెనుక నొప్పి, వాంతులు, వికారం, చర్మంపై దద్దుర్లు లేదా తీవ్రమైన అలసట కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి.
ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
పై లక్షణాలు కనిపిస్తే స్వయంగా మందులు వాడకుండా వైద్యుడిని సంప్రదించి, అవసరమైన రక్తపరీక్షలు చేయించుకోవాలి.
వెంటనే వైద్యుడిని సంప్రదించండి
చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు, అలాగే మధుమేహం లేదా మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నవారు దోమల నుంచి రక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.