AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CBSE 2nd Board Exams 2026: సీబీఎస్సీ పదో తరగతి 2nd బోర్డు పరీక్షల టైం టేబుల్‌ విడుదల.. ఎవరు అర్హులంటే?

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్సీ) 10వ తరగతి సెకండ్‌ బోర్డు పరీక్షల టైం టేబుల్‌ విడుదల చేసింది. రెండవ విడత పరీక్షలు మే 15 నుంచి ప్రారంభమవుతాయి. మొదట గణితం (స్టాండర్డ్), గణితం (బేసిక్) పేపర్లు జరుగుతాయి. ఈ పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు జరుగుతాయి. అయితే కొన్ని పేపర్లు మధ్యాహ్నం 12:30 గంటలకు ముగుస్తాయి.

CBSE 2nd Board Exams 2026: సీబీఎస్సీ పదో తరగతి 2nd బోర్డు పరీక్షల టైం టేబుల్‌ విడుదల.. ఎవరు అర్హులంటే?
CBSE 2nd Board Exams time table
Srilakshmi C
|

Updated on: Apr 23, 2026 | 12:00 PM

Share

హైదరాబాద్‌, ఏప్రిల్ 23: సీబీఎస్సీ బోర్డు పరీక్షలు ఏడాదికి రెండు సార్లు నిర్వహించే విధానాన్ని గత సంవత్సరం సీబీఎస్ఈ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీనిని 2026 బోర్డు పరీక్షల నుండి అమలు చేస్తున్నారు. ఈ విధానం ప్రకారం విద్యార్థులు గరిష్టంగా మూడు సబ్జెక్టులలో తమ స్కోర్‌లను మెరుగుపరుచుకోవడానికి వీలు కల్పిస్తుంది. మే 15 నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి సెకండ్‌ బోర్డు పరీక్షలు మే 21వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు సెకండ్ బోర్డు పరీక్షల టైం టేబుల్‌ను సీబీఎస్ఈ విడుదల చేసింది. 2026 నుంచి అమలులోకి వస్తున్న ఈ కొత్త బోర్డు పరీక్షల విధానం విద్యార్థులు గరిష్టంగా మూడు సబ్జెక్టులలో తమ స్కోర్లను మెరుగుపరుచుకోవడానికి వీలు కల్పిస్తుంది.

సీబీఎస్సీ 10వ తరగతి రెండవ బోర్డు పరీక్ష 2026 టైమ్ టేబుల్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Cbse 1 Cbse 2

సీబీఎస్సీ సెకండ్‌ బోర్డు పరీక్షకు ఎవరు అర్హులంటే..?

  • మొదటి పరీక్షలో కనీసం మూడు సబ్జెక్టుల పరీలకు హాజరై ఉండాలి.
  • 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్ధులు తమ మార్కులను మెరుగుపరచుకోవాలనుకునేందుకు రాయవచ్చు.
  • కంపార్ట్‌మెంట్ కేటగిరీ విద్యార్థులు
  • ఒక సబ్జెక్టుకు బదులుగా ఆరవ సబ్జెక్టును చేర్చుకుని ఉత్తీర్ణులైన విద్యార్థులు
  • UFM కేటగిరీ 1 కింద ఉంచబడిన విద్యార్థులు
  • 2025 కంపార్ట్‌మెంట్ కేటగిరీకి చెందిన విద్యార్థులు
  • మూడు ప్రధాన సబ్జెక్టుల వరకు ఇంప్రూవ్‌మెంట్‌ కోరుకునే విద్యార్థులు
  • మొదటి/మూడవ అవకాశం కంపార్ట్‌మెంట్ లేదా కంపార్ట్‌మెంట్ + ఇంప్రూవ్‌మెంట్‌కు హాజరయ్యే విద్యార్థులు
  • సీబీఎస్ఈ స్పోర్ట్స్‌ విద్యార్థులు

విద్యాపరంగా విద్యార్ధులు నష్టపోకుండా మార్కులు మెరుగుపరుచుకునేందుకు ఇది మంది అవకాశం. అంతేకాకుండా ప్రధాన బోర్డు పరీక్షల సమయంలో ఒత్తిడి తగ్గించడానికి, ఫలితాలలో అధిక మార్కులు పొందేందుకు వీలు కల్పిస్తుంది.అయితే మూడు లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులలో ఫెయిల్ అయిన విద్యార్ధులు, పరీక్షలకు హాజరుకాని విద్యార్థులు, ER కేటగిరీ కింద ఉంచబడిన విద్యార్థులకు సీబీఎస్సీ రెండో విడత పరీక్షలకు రాసేందుకు అర్హత ఉండదు. వీరంతా వచ్చే ఏడాది మాత్రమే పరీక్షలు రాసేందుకు అర్హులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.

Follow Us