AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Govt School: ఆ సర్కార్‌ బడిలో పదో తరగతి పాసైన ఒకే ఒక్కడు.. టీచర్ల సంబరాలు!

ఓ ప్రభుత్వ బడిలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. అక్కడ ఒకే ఒక్క పదో తరగతి విద్యార్ధి ఉన్నాడు మరీ.. ఆ ఒక్క విద్యార్ధి కోసం ఏడుగురు టీచర్లు పడిన కష్టం ఫలించి పదో తరగతిలో పాస్‌ అవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అదే కార్పొరేట్ స్కూళ్లు, ప్రైవేటు స్కూళ్లు అయితే బోలెడు..

Govt School: ఆ సర్కార్‌ బడిలో పదో తరగతి పాసైన ఒకే ఒక్కడు.. టీచర్ల సంబరాలు!
Mallapur ZP High School SSC student
Srilakshmi C
|

Updated on: May 04, 2026 | 4:19 PM

Share

హైదరాబాద్‌, మే 4: తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 29న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల్లో రాష్ట్రంలో 95.15 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్రంలో ఉన్న 5,731 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఆరు స్కూళ్లలో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదైంది. అయితే ఓ ప్రభుత్వ బడిలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. అక్కడ ఒకే ఒక్క పదో తరగతి విద్యార్ధి ఉన్నాడు మరీ.. ఆ ఒక్క విద్యార్ధి కోసం ఏడుగురు టీచర్లు పడిన కష్టం ఫలించి పదో తరగతిలో పాస్‌ అవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అదే కార్పొరేట్ స్కూళ్లు, ప్రైవేటు స్కూళ్లు అయితే బోలెడు యాడ్స్ ఇచ్చుకుని ప్రమోట్ చేసుకునేవేమో. సర్కార్‌ బడిలో ఒకే ఒక్క విద్యార్థి టెన్త్‌ పాస్ అయిన ఘటన స్థానికంగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఆ కథేమిటో ఇక్కడ తెలుసుకుందాం..

తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ జెడ్పీ హైస్కూల్‌లో ఏడుగురు ఉపాధ్యాయులు ఉంటే.. మొత్తం మీద విద్యార్ధులు మాత్రం ఆరుగురే చదువుతున్నారు. ఇందులో పదో తరగతిలో ఒకే ఒక్క విద్యార్ధి గుంటి మధు ఉన్నాడు. ఆ ఒక్క విద్యార్ధి మధు కూడా బడికి రెగ్యులర్‌గా వచ్చేవాడు కాదు. మధు స్కూల్‌కు వెళ్లకపోయినా సరే.. టీచర్లు మాత్రం పట్టుదలతో నేరుగా అతడి ఇంటికెళ్లి పాఠాలు చెప్పారు. అలా మధుతో పదో తరగతి పరీక్షలు కూడా రాయించారు. తాజాగా వెలువడిన పదో తరగతి ఫలితాల్లో మధు 429 మార్కులతో పాస్ అయ్యాడు. దీంతో తమ స్కూళ్లో చదువుతున్న ఏకైక పదో తరగతి విద్యార్థి ఫస్ట్‌ క్లాస్‌లో పాసైనందుకు టీచర్లంతా పండగ చేసుకున్నారు. ఉన్న ఒక్క టెన్త్ స్టూడెంట్ పాస్ అవడంతో స్కూల్ జీరో పర్సెంట్ ఫలితాల నుంచి బయటపడినట్లైంది. అంతేనా.. స్కూల్‌ 100 శాతం ఉత్తీర్ణత పాసైనట్లు రికార్డుల్లోకి సైతం ఎక్కింది. ఒకవేళ మధు ఫెయిలైతే ఉత్తీర్ణత శాతం సున్నాగా ఉండేది.

అందుకే అక్కడి టీచర్లు ఎలాగైనా మధును పాస్ చేయించాల్సిందేనని భీష్మించుకున్నారు. తోటి విద్యార్ధులెవరూ లేకపోవడంతో మధు రెగ్యులర్‌గా స్కూల్‌కి వచ్చేవాడు కాదు. దీంతో టీచర్లు మధు ఇంటికే వెళ్లి పాఠాలు చెప్పేవాళ్లు. స్కూల్‌ మొత్తం మీద పదో తరగతిలో మధు ఒక్కడే ఉండటంతో.. అతడు క్లాస్‌లో టాపర్, స్కూల్‌లో టాపర్‌గా నిలిచాడు. రాష్ట్రంలో టీచర్ల హేతుబద్ధీకరణ కారణంగా ఇలా విద్యార్ధులు ఒక్కరున్నా.. ఆ ఒక్కరి కోసం టీచర్లంతా పని చేస్తున్నారు. ఇక మరికొన్ని స్కూళ్లలో విద్యార్ధులు లెక్కకుమించి ఉన్నా టీచర్లు అరకొరగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో జీరో ఎన్‌రోల్‌మెంట్, వెరీ లో ఎన్‌రోల్‌మెంట్ స్కూళ్ల సంఖ్య నానాటికీ పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
రిలయన్స్ జోరు.. కేవలం 4 రోజుల్లో రూ. 1.39 లక్షల కోట్ల లాభం!
రిలయన్స్ జోరు.. కేవలం 4 రోజుల్లో రూ. 1.39 లక్షల కోట్ల లాభం!
శుక్రుడితో లక్ష్మీ యోగం! ఆ రాశుల వారికి సిరిసంపదలు ఖాయం..!
శుక్రుడితో లక్ష్మీ యోగం! ఆ రాశుల వారికి సిరిసంపదలు ఖాయం..!
చనిపోయిన భర్త కల నెరవేర్చిన టాలీవుడ్ హీరోయిన్.. బ్యూటిఫుల్ వీడియో
చనిపోయిన భర్త కల నెరవేర్చిన టాలీవుడ్ హీరోయిన్.. బ్యూటిఫుల్ వీడియో
టెట్‌ 2026కు భారీగా తగ్గిన దరఖాస్తులు.. పరీక్షలు ఎప్పుడంటే?
టెట్‌ 2026కు భారీగా తగ్గిన దరఖాస్తులు.. పరీక్షలు ఎప్పుడంటే?
సెప్టెంబర్ 8 నుండి ఈ ఫోన్లలో వాట్సాప్ బంద్! మీ ఫోన్ కూడా ఉందా?
సెప్టెంబర్ 8 నుండి ఈ ఫోన్లలో వాట్సాప్ బంద్! మీ ఫోన్ కూడా ఉందా?
తమిళనాడు సీఎం స్టాలిన్ ఘోర పరాజయం..
తమిళనాడు సీఎం స్టాలిన్ ఘోర పరాజయం..
టీవీకే విజయంపై విజయ్ తండ్రి చంద్రశేఖర్ ఏమన్నారంటే..
టీవీకే విజయంపై విజయ్ తండ్రి చంద్రశేఖర్ ఏమన్నారంటే..
నాలుగు గ్రహాల కటాక్షం.. అదృష్టం వారి తలుపు తట్టే ఛాన్స్..!
నాలుగు గ్రహాల కటాక్షం.. అదృష్టం వారి తలుపు తట్టే ఛాన్స్..!
ప్రపంచంలో అత్యధిక బంగారు నిల్వలు ఉన్న దేశాలు ఏవి? భారతదేశం ఎక్కడ?
ప్రపంచంలో అత్యధిక బంగారు నిల్వలు ఉన్న దేశాలు ఏవి? భారతదేశం ఎక్కడ?
ఓటమి దిశగా డీఎంకే పార్టీ.. వెక్కివెక్కి ఏడ్చిన కార్యకర్త
ఓటమి దిశగా డీఎంకే పార్టీ.. వెక్కివెక్కి ఏడ్చిన కార్యకర్త