Actress: 12 ఏళ్లకే బ్లాక్ బస్టర్ సినిమాతో సంచలనం.. 19 ఏళ్లకే మృత్యు ఒడిలోకి.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?
సినిమా ఇండస్ట్రీలోని కొన్ని విషాదాలను అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ నటి మరణం కూడా అలాంటిదే. 12 ఏళ్లకే బ్లాక్ బస్టర్ సినిమాతో సంచలనం సృష్టించి, 19 ఏళ్లకే మృత్యు ఒడికే చేరడాన్ని సినిమా తారలే కాదు సగటు సినీ ప్రేక్షకుడు కూడా జీర్ణించుకోలేకపోతున్నాడు.

సుమారు రెండేళ్ల క్రితం భారతీయ సినిమా పరిశ్రమలో ఒక తీరని విషాదం చోటు చేసుకుంది. అప్పటికీ సినిమా ఇండస్ట్రీలో ధ్రువతారగా వెలుగొందుతోన్న ఓ సినిమా హీరోయిన్ సడెన్ గా ఈ లోకం నుంచి వెళ్లిపోయింది. ఆ విషాదం జరిగి ఇప్పటికీ రెండేళ్లు కావడంతో సినిమా సెలబ్రిటీలతో పాటు అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. ఆ నటిని గుర్తు తెచ్చుకుంటూ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టులు షేర్ చేస్తున్నారు. ఈ నటికి చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి ఉండేది. అందుకు తగ్గట్టుగానే ఛైల్డ్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఓ స్టార్ హీరో సినిమాలో ఛైల్డ్ ఆర్టిస్ట్ గా నటించేందుకు ఆడిషన్స్ జరగ్గా.. సుమారు 20 వేల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. కానీ ఈ 12 ఏళ్ల పాప మాత్రమే అన్ని టెస్టులు పాసై సినిమాకు ఎంపికైంది. మూవీ కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక చదువు పూర్తయిన వెంటనే పూర్తి స్థాయిలో సినిమాల్లోకి వెళదామని కలలు కంది. కానీ దేవుడు ఆమె రాతను మరోలా రాశాడు. అసలు ఆమెను భూమీ మీద లేకుండా తీసుకెళ్లిపోయారు. ఆమె మరెవరో కాదు దంగల్ ఛైల్డ్ ఆర్టిస్ట్ సుహాని భట్నాగర్.
ఫిబ్రవరి 16 2024న సాయంత్రం సుహాని కన్నుమూసింది. ఆమె మరణం కుటుంబ సభ్యులనే కాదు యావత్ భారతీయ సినిమా ఇండస్ట్రీనే షాక్ కు గురి చేసింది. సుహాని మరణానికి గల కారణాలను ఆమె తండ్రి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘సుహానీ మరణించడానికి రెండు నెలల ముందే ఆమె చేయి వాచింది. మొదట్లో ఇది సాధారణ విషయం అనుకున్నా. ఆ తర్వాత కొన్ని రోజులకు రెండో చెయ్యి కూడా వాపు వచ్చింది. ఆ పై శరీరం అంతా కూడా వాచిపోయింది. దీంతో వెంటనే వైద్యులను సంప్రదించాం. సుహానీని ఢిల్లీ ఎయిమ్స్ లో చేర్పించాం. పలు రకాల వైద్య పరీక్షలు చేసిన తర్వాత డెర్మటోమయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. దీనికి స్టెరాయిడ్స్ మాత్రమే చికిత్స అని తేల్చిచెప్పారు. కానీ స్టెరాయిడ్స్ ఎఫెక్ట్ కు సుహానీ శరీరం తట్టుకోలేకపోయింది. క్రమంగా ఆరోగ్యం క్షీణించింది. చివరికి సుహానీ శరీరం బాగా ఇన్ఫెక్షన్ కు గురైంది. చివరకు ఆమె శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంది. చివరకు 2024 ఫిబ్రవరి 16న సుహాని కన్నుమూసింది’ అని ఆయన ఎమోషనల్ అయ్యారు.
एक दुखद खबर सामने आई है,,😔😔
फिल्म Dangal में छोटी बबीता फोगाट का किरदार निभाने वाली अभिनेत्री Suhani Bhatnagar का 17 फरवरी 2024 को 19 वर्ष की उम्र में निधन हो गया था।
रिपोर्ट्स के अनुसार
वह कुछ समय से स्वास्थ्य समस्याओं से जूझ रही थीं। उनके निधन की खबर से फिल्म इंडस्ट्री और… pic.twitter.com/UsR6vSLcLt
— Kirti Priya (@Yadav_kittu20) February 23, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




