- Telugu News Photo Gallery Cinema photos Tollywood upcoming coming movies like hari hara veera mallu the raja saab ghaati movie release date postpone
టాలీవుడ్ లో కంటిన్యూ అవుతున్న వాయిదాల పర్వం
మీరు ఏదో ఒకటి చెప్పండి.. చెప్పిందానికి స్టిక్ ఆన్ అయి ఉండండి. పదే పదే మీరు మారుస్తుంటే.. డైలమాతో ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు... అనే మాట వినిపిస్తోంది చిన్న సినిమాల నుంచి. ఇంతకీ పెద్ద సినిమాల వాయిదాలకు కారణాలేంటి? పవర్‌స్టార్ కాల్షీట్ల కోసం వెయిట్ చేస్తున్నారు హరి హర వీరమల్లు మేకర్స్.
Updated on: Apr 22, 2025 | 9:50 PM

మీరు ఏదో ఒకటి చెప్పండి.. చెప్పిందానికి స్టిక్ ఆన్ అయి ఉండండి. పదే పదే మీరు మారుస్తుంటే.. డైలమాతో ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు... అనే మాట వినిపిస్తోంది చిన్న సినిమాల నుంచి. ఇంతకీ పెద్ద సినిమాల వాయిదాలకు కారణాలేంటి?

పవర్‌స్టార్ కాల్షీట్ల కోసం వెయిట్ చేస్తున్నారు హరిహరవీరమల్లు మేకర్స్. హీరో నాలుగు రోజులు కాల్షీట్ ఇస్తే కంప్లీట్ చేస్తామని అంటున్నారు. మే 9న పవర్‌స్టార్ థియేటర్లలోకి వస్తారా? రారా? అనే డైలమా మార్కెట్లో కంటిన్యూ అవుతోంది. కొత్త డేట్‌ని కపుల్ ఆఫ్ డేస్‌లో అనౌన్స్ చేస్తారనే మాట కూడా వినిపిస్తోంది.

ఇలాంటి సందిగ్ధత రాజాసాబ్ విషయంలోనూ కనిపిస్తోంది. ఏదో ఒక ఫ్రెష్ ఐడియా రావడం.. దానికి తగ్టట్టు మ్యూజిక్‌తో పాటు సపోర్టింగ్ సీన్స్ ని మార్చడం.. వీఎఫ్ ఎక్స్ కోసం నెలలకు నెలలు వెయిట్ చేయడం.. ఇలా కారణాలు ఏవైతేనేం.. సినిమాలు వాయిదా పడుతూనే ఉన్నాయి.

డార్లింగ్ రాజా సాబ్ మాత్రమే కాదు, అనుష్క ఘాటి మూవీ పరిస్థితి కూడా ఇదే. 2025మీద ఫస్ట్ ఖర్చీఫ్ వేసింది టాక్సిక్ మూవీ. కానీ అనుకున్న తేదీకి రాలేకపోతున్నామని ఆ మధ్య నయా డేట్‌ని అనౌన్స్ చేసింది.

స్టోరీ డిస్కషన్స్ లోనూ, లొకేషన్ల వేటలోనూ రాజీపడని మనస్తత్వం, అనుకున్న కాస్టింగ్‌లో మార్పులు చేర్పులు ఉండటం... మార్క్ చేసుకున్న డేట్‌కి షూట్ కంప్లీట్ కాకపోవడం.. ఇలా సమ్మర్ నుంచి టాక్సిక్ వాయిదాపడటానికి కారణాలు ఎన్నెన్నో.




