AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yash: ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా బుల్లెట్ దిగిందా లేదా అంటున్న యశ్

ప్లానింగ్ అంటే ఇలా ఉండాలి అనేలా తన కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారు యశ్. కేజియఫ్ 2 తర్వాత యశ్ ఏం చేస్తున్నాడు..? ప్రైమ్ టైమ్ వేస్ట్ చేస్తున్నాడు.. ఎందుకింత గ్యాప్ తీసుకుంటున్నాడు.. ఒక్క సినిమా కోసం ఇంత టైమ్ అవసరమా అంటూ ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా బాగా హర్ట్ అయ్యారు. కానీ యశ్ ప్లానింగ్ మరోలా ఉంది. అదేంటో మీరూ చూసేయండి..

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Phani CH|

Updated on: Apr 22, 2025 | 9:44 PM

Share
కొందరు హీరోలకు కొన్ని సినిమాలు ఐకానిక్‌గా అలా ఉండిపోతాయి. ప్రభాస్‌కు బాహుబలి.. అల్లు అర్జున్‌కు పుష్ప.. యశ్‌కు కేజియఫ్. ఈ సినిమాలతో తమ ఇండస్ట్రీలో కాదు.. పక్క ఇండస్ట్రీల్లోనూ జెండా పాతారు వీళ్ళంతా.

1 / 5
ఈ ఇమేజ్‌ను బట్టే వాళ్ల కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారు. యశ్ కూడా అంతే. ప్రస్తుతం ఈయన మూడు సినిమాలు చేస్తున్నారు. కేజియఫ్ 2 వచ్చి మూడేళ్లు పూర్తైంది. ఈ గ్యాప్‌లో సలార్‌తో వచ్చారు ప్రశాంత్ నీల్.

2 / 5
ఆయన మరో రెండు మూడు సినిమాలు కూడా చేస్తున్నారు. కానీ యశ్ మాత్రం ఇంకా సినిమా చేస్తూనే ఉన్నారు. టాక్సిక్ సినిమా చేస్తున్నా ఈ సినిమాపై అప్‌డేట్స్ లేవు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌తో పాటు రామాయణ కూడా మొదలుపెట్టారు రాకింగ్ స్టార్.

3 / 5
మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ టాక్సిక్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం ఎక్కువగా ముంబైలోనే ఉంటున్నారు యశ్. కొన్ని సీన్స్ నచ్చకపోవడంతో రీ షూట్స్ చేసారు కూడా. అలాగే రామాయణ్‌లో రావణుడిగా నటిస్తున్నారు యశ్. ఈ సినిమాకు ఈయన సహ నిర్మాత కూడా. ఈ వారమే ముంబైలో కొత్త షెడ్యూల్ మొదలు కానుంది.

4 / 5
రావణుడిపై కొన్ని కీలక సన్నివేశాలు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ షెడ్యూల్ అంతా యశ్‌పైనే జరగనుంది. ఆయన సోలో సీన్స్ చిత్రీకరించబోతున్నారు దర్శకుడు నితేష్ తివారి. రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి సీతగా కనిపిస్తున్నారు. టాక్సిక్, రామాయణ తర్వాత కేజియఫ్ 3 మొదలవుతుందని తెలిపారు యశ్.

5 / 5
నాలుగు భాషల్లో రీమేక్ అయిన సినిమా.. కానీ తెలుగులో డిజాస్టర్..

కల్యాణ్, ఇమ్మూలది తొండాట..టాప్ కంటెస్టెంట్స్ గుట్టురట్టు.. వీడియో

బీసీసీఐకి ఇండిగో చుక్కలు..పుణె వైపు పరుగులు పెట్టిన ప్లేయర్లు

బెల్లం ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..? మీరు చేసే తప్పులతో..

రతన్ టాటా సవతి తల్లి కన్నుమూత.. అమె గురించి తెలిస్తే షాకవుతారు!

పుతిన్‌తో మోదీ భేటీ… భారత్–రష్యా బంధానికి కొత్త దిక్సూచి

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!

సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా

అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్

రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం