Abhinaya: గ్రాండ్గా అభినయ వెడ్డింగ్ రిసెప్షన్.. ఎంత అందంగా ఉన్నారో చూశారా.. ?
దక్షిణాది చిత్రపరిశ్రమలో అద్భుతమైన నటనతో అడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకుంది అభినయ. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇటీవల అభినయ వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె రిసెప్షన్ ఫోటోస్ షేర్ చేశారు.
Updated on: Apr 22, 2025 | 9:47 PM

టాలీవుడ్ నటి అభినయ వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆమె చిరకాల ప్రియుడుు హైదారాబాద్ కు చెందిన వేగేశ్న కార్తీక్ అలియాస్ ఏడడుగులు వేశారు. జూబ్లీహిల్స్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో వీరి వేడుక జరిగింది.

ఈ కార్యక్రమానికి బంధుమిత్రులు, సన్నిహితులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అభినయ, కార్తీక్ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. ఆ స్నేహం ప్రేమగా మారిందని.. గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.

తాజాగా వీరిద్దరి రిసెప్షన్ వేడుక గ్రాండ్ గా జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను అభినయ తన ఇన్ స్టాలో షేర్ చేశారు. 2008లో అభినయ రవితేజ నటించిన నేనింతే సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టారు.

ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు, శంభో శివ శంభో వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది.

ఇటీవల మలయాళం పని సినిమాతో సూపర్ హిట్ అందుకుంది అభినయ. అయితే కొద్దిరోజుల క్రితం ఆమె విశాల్ సరసన మార్క్ ఆంటోని చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ కామెంట్స్ వచ్చాయి.




