AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోట శ్రీనివాసరావు తమ్ముడి గురించి తెలుసా.? తెలుగులో తోపు నటుడు ఆయన

750కి పైగా సినిమాల్లో నటించారు కోట శ్రీనివాసరావు. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు. కమెడియన్‌గా, విలన్‌గా ఏ పాత్రకైనా జీవం పోశారు. కృష్ణాజిల్లా కంకిపాడులో 1942 జులై 10న కోట శ్రీనివాసరావు జన్మించారు. బాల్యం నుంచే కోటకు నాటకాలంటే చాలా ఆసక్తి. సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంకులో పనిచేశారు.

కోట శ్రీనివాసరావు తమ్ముడి గురించి తెలుసా.? తెలుగులో తోపు నటుడు ఆయన
Kota Srinivasa Rao
Rajeev Rayala
|

Updated on: Jan 01, 2026 | 9:29 AM

Share

దిగ్గజ నటుడు కోటా శ్రీనివాసరావు గురించి ప్రేత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో రకరకాల పాత్రలు చేసి మెప్పించారు కోటా శ్రీనివాసరావు. గత ఏడాది జులైలో అనారోగ్య సమస్యలతో కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. ఆయన సోదరుడు కూడా టాలీవుడ్ నటుడే.. పలు సినిమాల్లో విలన్ గానూ మెప్పించారు ఆయన. ఆయన పేరు కోట శంకర్ రావు. ఆయన చాలా మందికి సుపరిచితులే.. విలన్ గా మెప్పించిన ఆయన సీరియల్స్ లోనూ కనిపించి ఆకట్టుకున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. టీవీ రంగం నుంచి సినిమాలకు వెళ్లే నటుల గురించి, వారికి ఎదురయ్యే సవాళ్ల గురించి కోట శంకర్ రావు తన అభిప్రాయాలను పంచుకున్నారు.

Year Ender 2025: ఓజీ, సంక్రాంతికి వస్తున్నాం, హిట్3 కాదు.. ఈ ఏడాది బిగెస్ట్ హిట్ సినిమా ఇదే

గతంలో టీవీ నటులు సినిమాలకు సెట్ కారనే ఊహ ఉండేదని, అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని ఆయన అన్నారు. అయితే, టీవీ నుంచి వచ్చి సినిమా స్టార్స్ అయినవారు ఏ భాషలోనైనా చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారని ఆయన పేర్కొన్నారు, హిందీలో కొంతమంది ఉన్నప్పటికీ, ఇది చాలా పరిమితంగానే ఉందని తెలిపారు. దీనికి ప్రధాన కారణం ఓవర్ ఎక్స్పోజర్ అని కోట శంకర్ రావు అన్నారు. టీవీలో రోజు కనపడటం, సీరియల్స్, ప్రమోల ద్వారా ప్రేక్షకులు నిరంతరం చూస్తుండటం వల్ల ఓవర్ ఎక్స్పోజర్ అవుతుందని, ఇది నటులకు కొంత ప్రమాదకరమని ఆయన అన్నారు.

ఆ స్టార్ హీరో నన్ను బెదిరించే వాడు.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్ మీనా

టీవీలో ఎంత కష్టపడి నటించినా, అనేక పాత్రలు చేసినా, టీవీ రంగం తన మనసుకు నచ్చిన విధంగా నటనను ప్రదర్శించడానికి, ఆర్థికంగా, కీర్తి ప్రతిష్టలు సంపాదించడానికి చాలా సహాయపడిందని అన్నారు. అలాగే తన అన్న కోట శ్రీనివాసరావు గురించి మాట్లాడుతూ.. మా అన్నయ్య ఇంట్లో కుటుంబ సభ్యులను కలిసే సమయం లేకుండా గడిపారు. నాకు సినిమా అవకాశాలు కావాలని ఆయనను అడిగాను ఆయన కూడా సహాయం చేశారని కోట శంకర్ రావు అన్నారు. బిజీ షెడ్యూలు వల్ల అన్నయ్య ఫ్యామిలీకి దూరంగా ఉండేవారు. 120 రోజుల వరకు ఫ్యామిలీకి దూరంగా ఉండేవారు అని అన్నారు కోట శంకర్ రావు.

ఇవి కూడా చదవండి

అందుకే ఇన్ స్టాలో అలాంటి ఫోటోలు షేర్ చేస్తా.. ఓపెన్‌గా చెప్పేసిన ఇనయ సుల్తానా

Kota Srinivasa Rao News

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.