అభ్యర్ధుల ఓటమితో.. కసితో దాడి! గిఫ్ట్‌లు తిరిగి ఇచ్చేసిన ఓటర్లు
భువనగిరి మున్సిపాలిటీలో ఓటమి పాలైన అభ్యర్థి కుటుంబం ఓటర్లపై దాడులకు తెగబడింది. ఎన్నికల ప్రచారంలో పంపిణీ చేసిన హాట్ బాక్సులు, చీరల పంపిణీ తర్వాత, ఓటు వేయలేదన్న కసితో ఖాళీ సీసాలతో ఇళ్లపై దాడి చేయడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి మచ్చగా మారిన ఈ ఘటనపై మహిళలు నిరసన తెలిపి, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఎన్నికల్లో గెలుపోటములు సహజం, కానీ ఓడిపోయామన్న కసితో ఓటర్లపై దాడులకు దిగడం ఇప్పుడు జిల్లాలో సంచలనంగా మారింది. భువనగిరి మున్సిపాలిటీలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రజాస్వామ్యానికే మచ్చగా నిలుస్తోంది. భువనగిరి మున్సిపాలిటీ 1వ వార్డు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పలబోజు స్వరూపరాణి, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు హాట్ బాక్సులు, చీరలను పంపిణీ చేశారు. అయితే, ఫలితాల్లో ఆమె బిఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ ఓటమిని జీర్ణించుకోలేని స్వరూపరాణి కుటుంబ సభ్యులు, వార్డులోని పలు కాలనీల్లో ఇళ్లపై ఖాళీ సీసాలతో దాడులకు తెగబడ్డారు. తమకు ఓటు వేయలేదన్న కోపంతో బెదిరింపులకు దిగడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకుల అరాచకాలపై కాలనీ మహిళలు తిరగబడ్డారు. “మేము అడగకుండానే గిఫ్ట్‌లు ఇచ్చి, ఇప్పుడు గొడవ చేస్తారా?” అంటూ నిలదీశారు. తమకు పంపిణీ చేసిన చీరలు, హాట్ బాక్సులను నడిరోడ్డుపై పడవేసి వినూత్నంగా నిరసన తెలిపారు. అనంతరం పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఓడిపోయిన అభ్యర్థి అనుచరుల బెదిరింపులకు భయపడేది లేదని, ఇలాంటి అరాచక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల తాయిలాల పర్వం చివరకు ఇలా రోడ్డు మీదకు రావడంతో అందరూ షాకవుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డ్రై క్లీనర్ మంత్లీ ఇన్‌కం.. రూ.2 లక్షలు నెట్టింట వైరల్‌గా పోస్ట్!
గిన్నిస్ రికార్డు సృష్టించిన భారీ పాము: చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే
నీళ్లా.. అని లైట్ తీసుకోకండి.. విషయం తెలిస్తే షాకే
దాబాలో చోరీకి వచ్చి.. లిక్కర్ బాటిల్స్ చూసి సిట్టింగ్.. ఆ తర్వాత
ఫ్రిజ్ ఓపెన్ చేయడానికి వెళ్లిన మహిళ.. సీన్ చూసి గుండె గుభేల్
పుంగనూరు గిత్తా మజాకా.. ఒంగోలు గిత్తకు మించిన క్రేజ్
బర్త్‌డే కేక్‌లో చచ్చిన బల్లి.. 11 మంది ఆసుపత్రిపాలు!
రెనోవేషన్ చేస్తుండగా కుప్పలు తెప్పలుగా పడిన బంగారం
మీ చెప్పులు పోయాయా.. అయితే చాట్ జీపీటీని అడగండి
రూబిక్ క్యూబ్స్‌తో అద్భుతమైన పోర్ట్రెయిట్ ఆర్ట్స్

