అదృష్టం, ఆనందం కలిసి రావాలంటే ఇంట్లో ఈ మొక్కలు పెంచండి
సొంత లేదా అద్దె ఇళ్లలో ఆర్థిక వృద్ధి, సానుకూల శక్తి, మానసిక ప్రశాంతత కోసం వాస్తు మొక్కలు కీలక పాత్ర పోషిస్తాయి. తులసి, మనీ ప్లాంట్, లక్కీ వెదురు, పీస్ లిల్లీ, స్నేక్ ప్లాంట్ వంటివి ఇంటికి అదృష్టం, ఐశ్వర్యం తీసుకువస్తాయి. వాస్తు నిపుణుల ప్రకారం, ఈ మొక్కలు ప్రతికూల శక్తిని తొలగించి, ఇంట్లో సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. వీటిని పెంచుకోవడం మీ నమ్మకంపై ఆధారపడి ఉంటుంది.
సొంత ఇల్లయినా..అద్దె ఇల్లయినా..అదృష్టం కలిసిరావాలి.. సంపదరావాలి.. ఇంట్లో అంతా ఆనందంగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కొంతమంది రాత్రింబవళ్లు కష్టపడినా వారి జీవితంలో ఎలాంటి ఎదుగుదల ఉండదు. అలాంటివారు ఇంట్లో కొన్ని రకాల మొక్కలను పెంచుకోవడం ద్వారా అదృష్టం కలిసి వస్తుందని, ఇంట్లో సానుకూలశక్లి చేకూరుతుందని వాస్తు నిపుణులు చెబుతారు. సాధారణంగా ప్రతి హిందువు ఇంటిముందు తులసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది. హిందూ ధర్మంలో తులసి మొక్కకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇది ప్రతి కూల శక్తిని తొలిగించి ఇంటిలో సానుకూల శక్తిని పెపొందిస్తుంది. అయితే కొంత మంది అద్దె ఇంటిలో నివసిస్తున్నప్పుడు దీనిని పెంచుకోరు, కానీ అద్దె ఇంటిలో ఉన్నాకూడా బాల్కనీలో ఈ మొక్కను పెంచుకొని, పూజించడం వలన ప్రతికూల శక్తి తొలగి, ఇంట్లో సానుకూలత ఏర్పడుతుందట. ఇటీవల ప్రతి ఒక్కరి ఇంటిలో మనీ ఫ్లాంట్ మొక్క అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఈ మొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుస్తుందని చెబుతారు వాస్తు నిపుణులు. ఈ మొక్కను లివింగ్ రూమ్‌లో పెంచుకోవడం వలన ఇది ప్రతికూల శక్తిని దూరం చేయడమే కాకుండా ఆర్థిక సమస్యలను తగ్గిస్తుందట. వాస్తు శాస్త్రం ప్రకారం అత్యంత శక్తివంతమైన మొక్కల్లో లక్కీ వెదురు మొక్క ఒక్కటి. మీకు లక్కు కలిసి రావాలి అంటే, తప్పకుండా మీరు మీ ఇంటిలో హాల్‌లో లక్కీవెదురు మొక్క పెట్టుకోవడం వలన ఇది కెరీర్ పరంగా విజయాలను అందిస్తుంది. సాను కూల శక్తి పెంపొందిస్తుంది. అలాగే సంబంధాలను మెరుగు పరుస్తుంది. పీస్ లిల్లీ మొక్క చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అంతే కాకుండా అంతే సానుకూలంగ కూడా ఉంటుంది. అయితే ఎవరు అయితే మానసిక సమస్యలతో బాధపడుతున్నారో వారు, దీనిని ఇంటిలో పెట్టుకోవడం చాలా మంచిదంటున్నారు నిపుణులు. ఈ మొక్క ఇంటిలో ఉండటం వలన మానిసిక ఒత్తిడి తగ్గి, ఇంట్లో ఆనందకర వాతావరణాన్ని సృష్టిస్తుంది. అలాగే గాలిని శుద్ధి చేస్తుంది. స్నేక్ ప్లాంట్ కూడా ఇంట్లో పెట్టుకోవడం చాలా మంచిది. ఇది లింగ్ రూమ్‌లో పెట్టుకోవడం వలన గాలిని శుద్ధ చేసి, ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. అంతే కాకుండా వాస్తు ప్రకారం కూడా లక్కు తీసుకొస్తుంది. స్నేక్ ఫ్లాంట్ ఇంట్లో ఉండటం వలన నెగటివ్ ఎనర్జీ పోయి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే ఆర్థికంగా కూడా లాభాలు చేకూరుస్తుంది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. వీటిని పాటించడం అనేది వారి వారి నమ్మకం, విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అనకాపల్లి అగ్నిప్రమాదం: గూడ్స్ రోడ్డులో మహిళా సజీవ దహనం
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో బిల్ గేట్స్: ఉండవల్లిలో అరటి తోటల పరిశీలన
రంగారెడ్డి రోడ్డు ప్రమాదం: హైదరాబాద్‌లో డివైడర్‌ను ఢీకొట్టిన కారు
ఐదుగురి ప్రాణాలను నిలిపిన చిన్నారి
ప్యాకెట్ పాలలో ప్రమాదకర కోలిఫామ్ బాక్టీరియా వీడియో
‘షట్‌డౌన్ చేస్తే చంపేస్తా’.. ఇంజినీర్‌కు ‘ఏఐ’ బెదిరింపు!
బీచ్ ఫెస్ట్.. ఎంటర్ టైన్ మెంట్ అదిరింది!
నింగిలో మిగ్ గర్జనలు.. పర్యాటకుల హర్షధ్వానాలు!
రోడ్డుపై రన్‌వే..చైనాకు దగ్గర్లో మోదీ విమానం
డేగకన్ను పడిందంటే డ్రోన్ కూలాల్సిందే!

