AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఓర్నీ.. ఎమ్మెల్యే తల్లి ఇంటినే టార్గెట్ చేశారు.. అదును చూసి..

ప్రమీలా దేవి కొడుకు ఎమ్మెల్యే నరేంద్ర గుంటూరులో ఉండే ఇంటికి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన దొంగలు ఆమె ఇంటికిలో చోరికి ప్లాన్ వేశారు. నిన్న రాత్రి ఇంటిలోకి చొరబడిన దొంగలు ఇంటిలో విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు కూడా పట్టుకెళ్లారు.

Andhra Pradesh: ఓర్నీ.. ఎమ్మెల్యే తల్లి ఇంటినే టార్గెట్ చేశారు.. అదును చూసి..
Dhulipala Narendra House Burglary
T Nagaraju
| Edited By: |

Updated on: Feb 17, 2026 | 4:59 PM

Share

Dhulipala Narendra house burglary: గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడి ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమారు సొంతూరు.. ఆయన తల్లి ప్రమీలా దేవి సొంతవూరులోనే నివసిస్తున్నారు. ప్రమీలా దేవి భర్త ధూళిపాళ్ల వీరయ్య చౌదరి రాష్ట్ర మంత్రిగా సేవలందించారు. రాజకీయ నేపధ్యం ఉన్న కుటుంబంతో పాటు సంగం డెయిరీ ఛైర్మన్ గా కూడా నరేంద్ర కొనసాగుతున్నారు. ప్రమీలా దేవి ఒక్కరే చింతలపూడిలోని ఇంటి నివసిస్తుండాన్ని దొంగలు గమనించారు. ఎప్పటి నుంచో కన్నేసి అదును కోసం ఎదురు చూశారు.

వారి వేచి ఉన్న రోజు రానే వచ్చింది. ప్రమీలా దేవి కొడుకు నరేంద్ర గుంటూరులో ఉండే ఇంటికి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన దొంగలు ఆమె ఇంటికిలో చోరికి ప్లాన్ వేశారు. నిన్న రాత్రి ఇంటిలోకి చొరబడిన దొంగలు ఇంటిలో విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు కూడా పట్టుకెళ్లారు. ఉదయాన్నే ఇంటి తలుపులు తొలగించి ఉండటాన్ని గమనించిన పని వాళ్లు వెంటనే ఈ విషయాన్ని ప్రమీలా దేవికి చేరవేశారు. హుటాహుటిన ఆమెను తీసుకొని నరేంద్ర చింతలపూడి చేరుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తో పోలీసులు రంగంలోకి దిగారు.

చోరికి పాల్పడిన ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. సోమవారం రాత్రి చోరి జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇంటి చుట్టు పక్కల ఉన్న సిసి కెమెరా విజువల్స్ ను సేకరించారు. వేలి ముద్రలు తీసుకున్న పోలీసులు ఈ తరహా దొంగతనాలు చేసే వారి గురించి వాకబు చేయడం మొదలు పెట్టారు.

ఇవి కూడా చదవండి

50 తులాల వరకూ బంగారు, 10 కేజీల వరకూ వెండి ఆభరణాలు, లక్ష రూపాయల నగదు పోయినట్లు భావిస్తున్నారు. ఆమె ఇంటిలోని లేని విషయాన్ని తెలుసుకున్న దొంగలు పక్కాగా చోరి చేయడం వెనుక తెలిసిన వాళ్ల హస్తం ఏమైనా ఉందా అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏకంగా ఎమ్మెల్యే తల్లి ఇంటినే దొంగలు టార్గెట్ చేసి చోరి చేయడం స్థానికంగా కలకలం రేపింది. మరి పోలీసులు దొంగలను పట్టుకుంటారో లేదో వేచి చూడాల్సిందే..

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నెట్స్ లో కాదు బాబర్ భయ్యా.. పిచ్ మీద ఆడితే కదా గెలిచేది
నెట్స్ లో కాదు బాబర్ భయ్యా.. పిచ్ మీద ఆడితే కదా గెలిచేది
హీరోయిన్ ప్రత్యూష కథ ఇదే.. కెరీర్ పీక్స్‏లో ఉన్నప్పుడే సూసైడ్..
హీరోయిన్ ప్రత్యూష కథ ఇదే.. కెరీర్ పీక్స్‏లో ఉన్నప్పుడే సూసైడ్..
అందరు చూస్తుండగానే విగతజీవిగా మారిన విద్యార్థి..!
అందరు చూస్తుండగానే విగతజీవిగా మారిన విద్యార్థి..!
ఎమ్మెల్యే తల్లి ఇంటినే టార్గెట్ చేశారు.. అదును చూసి..
ఎమ్మెల్యే తల్లి ఇంటినే టార్గెట్ చేశారు.. అదును చూసి..
పొద్దున్నే ఫీల్డ్‌లో లేపోతే పోస్ట్‌ ఊస్టింగే- సీఎం రేవంత్ రెడ్డి
పొద్దున్నే ఫీల్డ్‌లో లేపోతే పోస్ట్‌ ఊస్టింగే- సీఎం రేవంత్ రెడ్డి
చిన్న గింజలే కానీ.. ఆవాలు వల్ల కలిగే లాభాలెన్నో తెలుసా..?
చిన్న గింజలే కానీ.. ఆవాలు వల్ల కలిగే లాభాలెన్నో తెలుసా..?
రేపే ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల 2026 హాల్‌టికెట్లు విడుదల.. లింక్ ఇదే
రేపే ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల 2026 హాల్‌టికెట్లు విడుదల.. లింక్ ఇదే
టీ20 వరల్డ్ కప్‎లో సంచలనం.. ఒకే దెబ్బకు మూడు జట్లు అవుట్
టీ20 వరల్డ్ కప్‎లో సంచలనం.. ఒకే దెబ్బకు మూడు జట్లు అవుట్
భారీ పతనం.. గ్రాము బంగారం ధర రూ.10 వేలకు చేరనుందా..?
భారీ పతనం.. గ్రాము బంగారం ధర రూ.10 వేలకు చేరనుందా..?
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్