AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇప్ప పువ్వుతో ఆ జబ్బులన్నీ పోతాయ్.. ఆసుపత్రికి వెళ్లాల్సిన పనే ఉండదు.. ఆదివాసీల ఫ్లవర్ సీక్రెట్ ఇదిగో

ఇప్ప పువ్వు కేవలం సారా కోసమే అనే అపోహను వీడి.. దాని అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగించే ఇప్ప పువ్వు, కడుపు సమస్యలు, గుండె జబ్బులు, నోటిపూత, కీళ్ల నొప్పులు, చర్మ సమస్యలు వంటి అనేక సమస్యల నుంచి ఉపశమనం లభించేలా చేస్తుంది.. విప్ప పువ్వు ప్రయోజనాలను తెలుసుకోండి..

ఇప్ప పువ్వుతో ఆ జబ్బులన్నీ పోతాయ్.. ఆసుపత్రికి వెళ్లాల్సిన పనే ఉండదు.. ఆదివాసీల ఫ్లవర్ సీక్రెట్ ఇదిగో
Mahua Flower
Shaik Madar Saheb
|

Updated on: Feb 16, 2026 | 8:32 PM

Share

ఇప్ప పువ్వులో ఎన్నో పోషకాలతోపాటు.. ఔషధ గుణాలు పుష్కలంగా దాగున్నాయి.. అందుకే.. విప్ప పువ్వు (ఇప్ప పువ్వు – Mahua Flower)ను తీసుకోవాలని సూచిస్తుంటారు ఆయుర్వేద నిపుణులు.. ఇది పోషకాలు, ఔషధ గుణాలతో నిండిన ఒక అద్భుతమైన అటవీ ఉత్పన్నం.. అందుకే.. దీనిని ఆదివాసీలు బలంగా ఉండటానికి అసలు సీక్రెట్ ఇదేనని పేర్కొంటారు. ఇప్ప పూలలో విటమిన్ బి, సి, కాల్షియం, ఐరన్, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. ఈ పువ్వుల సారం రక్తాన్ని శుద్ధి చేస్తుంది.. ఇంకా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వాస్తవానికి.. ఇప్ప పువ్వు అంటే చాలా మందికి కేవలం సారా తయారీకి మాత్రమే ఉపయోగిస్తారనే భ్రమ ఉంటుంది. అయితే, ఇప్ప పువ్వులో దాగి ఉన్న అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు చాలా మందికి తెలియదు. ఆయుర్వేదంలో ఔషధాల తయారీకి ఇప్ప పువ్వును విరివిగా వాడుతారు. దీనిని నేరుగా తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఇప్ప పువ్వుతో ఎన్నో ప్రయోజనాలు..

ఇప్ప పువ్వు కడుపు సంబంధిత సమస్యలకు చక్కటి పరిష్కారం చూపుతుంది. అల్సర్, కడుపు ఉబ్బరం వంటి వాటికి ఇప్ప పువ్వు రసం తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. అంతేకాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

ఇందులో ఉండే ఓలిక్ యాసిడ్ గుండె జబ్బులను నివారించడంలో సహాయపడుతుంది.

ప్రతిరోజూ ఇప్ప పువ్వును నీటిలో మరిగించి, ఆ నీటితో పుక్కిలించడం వల్ల నోటిపూత, నోటి మంట, పంటి నొప్పి వంటి ఇబ్బందులు తగ్గుతాయి.

పాలల్లో ఇప్ప పువ్వు కలుపుకొని తాగడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.

ఇప్పపువ్వు తీసుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది. ఇంకా బలహీనత తగ్గి.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ఇప్ప పువ్వుతో తయారు చేసిన తైలం కీళ్ల నొప్పులకు మంచి ఔషధంగా పనిచేస్తుంది.

చర్మంపై వచ్చే దద్దుర్లు, దురదను తగ్గించడంలో ఇప్ప పువ్వు రసం ప్రభావవంతంగా ఉంటుంది.

నరాల బలహీనతతో బాధపడేవారు పాలలో ఇప్ప పువ్వును కలుపుకొని తాగితే ఆ సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు.

ఇప్ప పువ్వు సీజన్ ఇదే..

ఇప్ప పువ్వు సీజన్ ప్రధానంగా వేసవి కాలంలో.. ముఖ్యంగా ఫిబ్రవరి, మార్చి నుండి ఏప్రిల్ నెల వరకు ఉంటుంది. ఈ సమయంలో గిరిజనులు అడవికి వెళ్లి చెట్ల కింద రాలిన పూలను సేకరించి, ఎండబెట్టి ఉపాధి పొందుతారు. ఇవి పోషకాలకు నిలయమని ఆదివాసీలు పేర్కొంటున్నారు. విప్పపువ్వులను లడ్డూలు, సంప్రదాయ పానీయాలు, ఆయుర్వేద మందులలో ఉపయోగిస్తారు. ఆరోగ్య ప్రయోజనాలతో నిండిన ఇప్ప పువ్వును మీ దైనందిన జీవితంలో భాగం చేసుకోవడానికి ఇది సరైన సమయం.. కావున ఇవి దొరికితే కచ్చితంగా తీసుకోండి..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us