మహానంది ఆలయంలో కనిపించిన నాగుపామును పట్టుకునే ప్రయత్నంలో స్నేక్ క్యాచర్ మోహన్ కు దాని కాటు తగిలింది. సోమవారం జరిగిన ఈ ఘటనతో ఆలయంలో కలకలం రేగింది. ప్రాథమిక చికిత్స అనంతరం మోహన్‌ను నంద్యాల జీజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.