అదంతా ఫేక్.. ఆ విషయంపై క్లారిటీ ఇచ్చిన డింపుల్ హయతి
Rajeev
Pic credit - Instagram
15 February 2026
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోతుంది అందాల భామ డింపుల్ హయతి.
ఈ చిన్నది నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. స్టార్ హీరోల సినిమాల్లో చేసిన లాభం లేకుండాపోయింది.
ఇటీవల రవితోజ జోడిగా భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.
గత కొన్ని రోజులుగా ఈ బ్యూటీ గురించి సోషల్ మీడియాలో కొన్ని విషయాలు వైరలవుతున్నాయి. ఆమెకు ఇప్పటికే పెళ్లి అయిపోయిందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
అంతటితో ఆగకుండా డింపుల్ ఆమె భర్త డేవిడ్ పై పోలీసు కేసు నమోదైందంటూ ఓ పాత న్యూస్ ఆర్టికల్ షేర్ చేశారు.
తన గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని తెల్చి చెప్పింది డింపుల్. తనకు ఇంకా పెళ్లి కాలేదని.. సదరు నెటిజన్ షేర్ చేసిన ఆర్టికల్ సైతం ఫేక్ అని తెలిపింది.
వ్యక్తిగత విషయాల గురించి తప్పుడు ప్రచారం చేయడం పై ఘాటుగానే స్పందించింది డింపుల్ హయతి.