AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: చిరుకు సర్జరీ ?? ఆందోళనలో ఫ్యాన్స్

Chiranjeevi: చిరుకు సర్జరీ ?? ఆందోళనలో ఫ్యాన్స్

Phani CH
|

Updated on: Feb 17, 2026 | 12:21 PM

Share

మెగాస్టార్ చిరంజీవి చేతికి కట్టుతో కనిపించడం అభిమానుల్లో ఆందోళన రేపింది. అల్లు శిరీష్ పెళ్లి శుభలేఖ పంపిణీ సందర్భంగా వైరల్ అయిన ఈ ఫోటోలు పలు ప్రశ్నలు లేవనెత్తాయి. చిరంజీవికి ఇటీవల చిన్న భుజం సర్జరీ జరిగిందని, దాని నుండి కోలుకుంటున్నారని సమాచారం. నొప్పిని భరిస్తూనే ఆయన అభిమానులతో కలిసి ఫోటోలు దిగుతున్నారు, ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ను సందర్శించారు.

మన శంకరవరప్రసాద్ గారు సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి పెద్దగా కనిపించలేదు. అయితే ఇప్పుడు ఆయనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. అయితే ఆ ఫోటోల్లో చిరు చేతికి కట్టుతో కనిపించడం.. అభిమానులను ఆందోళన చెందేలా చేస్తోంది. చిరుకు ఏమైందోనని.. అందరూ ఆరా తీసేలా చేస్తోంది. మార్చి 6న అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ పెళ్లి జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు అట్టహాసంగా జరుగుతున్నాయి. పెళ్లి శుభలేఖల పంపిణీ కూడా ప్రారంభించారు. ఈక్రమంలో అల్లు ఫ్యామిలీ మొదటి శుభలేఖను మెగాస్టార్ చిరంజీవికి ఇచ్చారు. అల్లు అరవింద్ తో పాటు ఆయన సతీమణి, అలు శిరీష్ తో కలిసి చిరంజీవి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా సంప్రదాయం ప్రకారం నూతన వస్త్రాలతో పాటు పెళ్లి శుభలేఖ ను చిరంజీవి-సురేఖ దంపతులకు అందించారు. అయితే ఈ ఫోటోల్లో చిరంజీవి ఎడమ చేతికి.. హ్యాండ్ బెల్ట్ కనిపించింది.దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అసలు చిరంజీవి చేతికి ఏమయ్యింది. ఎందుకు ఇలా షోల్డర్ బ్యాగ్ తో కనిపించారు? అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అయితే రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి భుజానికి చిన్న సర్జరీ జరిగినట్లు తెలుస్తోంది. గత నెలలో ఈ శస్త్ర చికిత్స జరిగిందని సమాచారం. అందుకే భుజంపై ఒత్తిడి పడకుండా ఉండడం కోసమే చిరంజీవి ఈ హ్యాండ్ బెల్ట్ ను వాడుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇటీవల చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ను సందర్శించారు. అక్కడ కూడా తన అభిమానులతో కలిసి సరదాగా ఫొటోలు, వీడియోలు దిగారు. నొప్పిని భరిస్తూనే ఫ్యాన్స్ తో ఫొటోలు దిగారు మెగాస్టార్..

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Kova Bun Ali: కోవా బన్‌ వలికి.. మెగా సపోర్ట్‌

జూ పార్క్‌లో హిప్పోల బర్త్ డే సెలబ్రేషన్స్

పైకి మాత్రం కుటీర పరిశ్రమ.. లోపలే ఉంది అసలు రహస్యం

ఇసుకతో ప్రాణం పోశారు !! ఈ శిల్పాన్ని చూస్తే కళ్ళు తిప్పుకోలేరు !!

రాత్రి గుడారాల్లో.. పగలు కార్లలో.. ఐడియా అదిరింది

Follow Us