రాత్రి గుడారాల్లో.. పగలు కార్లలో.. ఐడియా అదిరింది
కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. ఉపాయం ఉండాలే కానీ ఉపాధికి మార్గాలు బోలెడు. విభిన్నమైన ఆలోచనతో సంచార జీవనాన్ని కూడా ఆధునికంగా మార్చుకోవచ్చని నిరూపిస్తున్నారు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కొందరు వనమూలికల వ్యాపారులు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శింగరకొండ పరిసరాల్లో వీరు సాగిస్తున్న 'వెరైటీ' జీవనశైలి ఇప్పుడు స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. ఉపాయం ఉండాలే కానీ ఉపాధికి మార్గాలు బోలెడు. విభిన్నమైన ఆలోచనతో సంచార జీవనాన్ని కూడా ఆధునికంగా మార్చుకోవచ్చని నిరూపిస్తున్నారు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కొందరు వనమూలికల వ్యాపారులు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శింగరకొండ పరిసరాల్లో వీరు సాగిస్తున్న ‘వెరైటీ’ జీవనశైలి ఇప్పుడు స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. శింగరకొండ దేవాలయానికి వెళ్లే దారిలో వరుసగా వేసిన గుడారాలు, వాటి ముందు నిలిపి ఉంచిన కార్లను చూసి భక్తులు, ఎవరో ధనవంతులు విహారయాత్రకు వచ్చి ఉంటారని భావించారు. కానీ, ఆరా తీస్తే వారు సంచార తెగలకు చెందిన వనమూలికా వైద్యులని తెలిసి నోరెళ్లబెట్టారు. రాత్రి వేళల్లో గుడారాల్లోనే తలదాచుకునే వీరు, పగలు మాత్రం తమ కార్లలో వనమూలికలు, ఆయుర్వేద ఔషధాలను తీసుకుని ప్రధాన కూడళ్లలో వ్యాపారం సాగిస్తున్నారు. సాధారణంగా సంచార తెగలు అంటే ఎడ్ల బండ్ల మీదో, కాలినడకనో ప్రయాణిస్తారని మనకు తెలుసు. కానీ, మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ వ్యాపారులు కార్లను సమకూర్చుకుని, తమ వ్యాపారాన్ని మరింత వేగంగా, సౌకర్యవంతంగా మార్చుకున్నారు. అడవుల నుండి సేకరించిన మూలికలను విక్రయిస్తూ.. కారునే షాపుగా మార్చేశారు. వీరి తెలివిని చూసి ఐడియా అదిరింది.. అంటూ స్థానికులు ప్రశంసిస్తున్నారు. ఉపాధి పొందే మార్గంలో ఆధునికతను జోడిస్తే విజయం ఖాయమని ఈ చిరువ్యాపారులు నిరూపిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డ్రై క్లీనర్ మంత్లీ ఇన్‌కం.. రూ.2 లక్షలు నెట్టింట వైరల్‌గా పోస్ట్!
గిన్నిస్ రికార్డు సృష్టించిన భారీ పాము: చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే
నీళ్లా.. అని లైట్ తీసుకోకండి.. విషయం తెలిస్తే షాకే
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

