చేసింది మూడు సినిమాలే.. కానీ కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఈ అమ్మడు 

Rajeev 

Pic credit - Instagram

16 February 2026

చేసింది మూడు సినిమాలే.. కట్ చేస్తే.. కుర్రాళ్లకు ఆరాధ్య దేవతగా మారింది దివ్య భారతి 

ఈ అమ్మడు తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ పెంచుకుంది. పాత్ర ఏదైనా కూడా దానికి ప్రాణం పోసి మరీ నటించింది.

‘బ్యాచిలర్’ సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ అమ్మడు. మొదటి చిత్రంలోనే హీరో జీవి ప్రకాష్‌తో బోల్డ్ సీన్స్, లిప్‌లాక్‌లతో రెచ్చిపోయింది.

అలాగే ఆ సినిమాలో సుబ్బలక్ష్మీ పాత్రకు ప్రాణం పోసి.. తన నటనకు ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ఆ హీరోతోనే 'కింగ్‌స్టన్' చిత్రంలో నటించింది.

సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ ఈ బ్యూటీ తన అందంతో అభినయంతో కట్టిపడేసింది. ప్రస్తుతం తెలుగులో నటిస్తుంది. 

సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న గోట్ అనే సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. 

కాగా చేసిన సినిమాలు తక్కువే అయినా సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేస్తుంది ఈ కుర్ర భామ.